ఆ ఎడిటర్ ను పెళ్లి చేసుకోవాలని ఉంది: రామ్ గోపాల్ వర్మ

కరోనా వైరస్ కు ఉపశమనంగా మనోళ్లు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మ్యాజిక్ చేస్తుంటారు. ఫర్ టైంపాస్ అన్నట్లుగా.. ఈ సోష‌ల్ మీడియా ప్రాచుర్యంలోకి వ‌చ్చాక కొత్త టాలెంట్‌లు బ‌య‌ట‌కి వ‌స్తున్నాయి. త‌మ‌లోని పూర్తి నైపుణ్యాన్ని వెలికి తీసి స‌రికొత్త‌గా వీడియోలు రూపొందిస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు.

తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత్‌ పర్యటనకు వచ్చిన స‌మ‌యంలోని కొన్ని విజువ‌ల్స్‌ని తీసుకొని ఓ వీడియో రూపొందించారు. ఆ వీడియో బ్యాక్ గ్రౌండ్‌లో సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌, మమ్ముట్టి కలిసి నటించిన దళపతి సినిమాలోని ‘సింగారాల పైరుల్లోన బంగారాలే పండెనంట’ పాట తమిళ వర్షన్‌ను జత చేర్చారు. ర‌జ‌నీకాంత్‌, మ‌మ్ముట్టి స్థానాల‌లో ఉన్న‌ ట్రంప్‌, మోడీలు ఒక‌రిని మించి మరొక‌రు పాట పాడుతున్న‌ట్టు రూపొందించారు. ఈ ఫ‌న్నీ వీడియో సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకోవ‌డంతో.. స‌ద‌రు వీడియోను పోస్ట్‌ చేస్తూ.. ‘దీన్ని ఎడిట్‌ చేసిన ఎడిటర్‌ను పెళ్లి చేసుకోవాలని ఉంది’ అంటూ ట్విటర్‌లో పేర్కొన్నాడు. అయితే ఇప్పుడు ఈ వీడియో వైర‌ల్ కావ‌డంతో తమకి సంబంధించిన భాష‌ని బ్యాక్‌గ్రౌండ్‌లో యాడ్ చేసి మ‌జాని పొందుతున్నారు నెటిజన్లు. మొత్తానికి ఎవరి పిచ్చి వారికి ఆనందం అన్నట్లు ఉంది వీరిగోల అనుకుంటున్నారు తటస్థులు.