ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్ధులకు సెలవుల పొడిగింపు

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్ధులకు సెలవుల పొడిగింపు

మహమ్మారి కరోనా వైరస్ ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుంది. కాగా తాజాగా రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 813 కి చేరుకుంది. అయితే ఈ వైరస్ వలన ఇప్పటికే 22 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో చాలా కీలకమైన నిర్ణయాలని తీసుకుంటుంది. కాగా రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కఠినంగా కొనసాగుతున్న నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. కాగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు మే 3 వరకూ సెలవులను పొడిగిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది.

ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్‌ చిన వీరభద్రుడు సంబంధిత ఉత్తర్వులను అధికారికంగా జారీ చేశారు. అయితే ప్రస్తుతానికి జరుగుతున్న విద్యా సంవత్సరం రేపటితో ముగియనుంది. కానీ కరోనా వైరస్ దారుణంగా విస్తరిస్తున్న తరుణంలో, పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించకుండానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెలవులను పొడిగించింది. ఇకపోతే ఇప్పటికి అమలులో ఉన్న సెలవుల ప్రకారం త్వరలో తమ నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడిస్తామని అధికారులు వెల్లడించారు.