అల్లు అర్జున్ రిస్క్.. సిల్వర్ స్క్రీన్‌పై తొలిసారి అలా …

లొకేషన్స్ వేటలో

న పుష్ప ది రూల్ చిత్రం సినిమా షూటింగ్‌ను చిత్ర యూనిట్ స్టార్ట్ చేయ‌బోతున్నార‌ట‌ ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లాల్సిన పుష్ప ది రూల్ చిత్రం ఎందుక‌నో కొన్ని కార‌ణాల‌తో ఆల‌స్య‌మ‌వుతూ వ‌చ్చింది. అయితే లేటెస్ట్ సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు త్వ‌ర‌లోనే పుష్ప ది రూల్ సినిమా షూటింగ్‌ను చిత్ర యూనిట్ స్టార్ట్ చేయ‌బోతున్నార‌ట‌. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన మ‌రో విష‌యం నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతోంది. అదేంటంటే.. పుష్ప ది రూల్‌లో అల్లు అర్జున్ 55 ఏళ్ల వ్య‌క్తిలా క‌నిపించ‌బోతున్నార‌ట‌. ఆ పాత్ర‌కు ఓ కొడుకు, కూతురు కూడా సినిమాలో క‌నిపించ‌బోతున్నార‌నేది టాక్‌. అందుకోసం చిత్ర యూనిట్ ఓ యంగ్ హీరో, హీరోయిన్‌ని వెతికే ప‌నిలో ప‌డ్డార‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. నాలుగు ప‌దులు వ‌య‌సున్న ఓ హీరో ఐదున్న‌ర ప‌దులున్న వ్య‌క్తిగా క‌నిపించ‌టం అంటే కాస్త రిస్కీ విష‌య‌మే. కానీ.. స‌బ్జెక్ట్ డిమాండ్ మేర‌కు బ‌న్నీ(Bunny) అలా యాక్ట్ చేయ‌టానికి ఒప్పుకున్నారని స‌మాచారం.

మ‌రి ఇందులో నిజా నిజాలేంటో తెలియాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే. త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్న ఈ సినిమాను వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేయాల‌నేది మేక‌ర్స్ ఆలోచ‌న‌గా క‌నిపిస్తోంది. పార్ట్ 1 భారీ హిట్ కావ‌టంతో పుష్ప ది రూల్ సినిమాపై హై రేంజ్ ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి. ర‌ష్మిక మంద‌న్న) హీరోయిన్‌గా న‌టిస్తోంది.