మహేశ్​ బాబుతో అందాల తార ఐశ్వర్య రాయ్ జక్కన్న నయా ప్లాన్….

Aishwarya-Rai

రాజమౌళి- మహేశ్‌ బాబు కాంబోలో తెరకెక్కనున్న సినిమా.. పూర్తి స్క్రిప్టు సిద్ధమవకముందే ఎన్నో అంచనాలు పెంచేసింది. ఈ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లోనే కాదు చిత్ర పరిశ్రమలోనూ ఆసక్తి నెలకొంది. అడవి నేపథ్యంలో సాగే యాక్షన్‌ సినిమా అనే ఊహాగానాలు ఆ అంచనాలను రెట్టింపు చేశాయి. రోజు ఈ చిత్రం గురించి రకరకాలు ఇంట్రెస్టింగ్ వార్తలు వస్తున్నాయి.

తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్టులో మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్​ను భాగం చేయాలని చిత్రబృందం భావిస్తోందట. ప్రస్తుతం ఈ విషయమై దర్శకుడు జక్కన ఆలోచిస్తున్నారని తెలిసింది. త్వరలోనే సంప్రదింపులు జరిపి ఈ విషయమై స్పష్టతకు రావాలని అనుకుంటున్నారట! అంతకుముందు ఇటీవలే మహేశ్ సరసన శ్రద్ధాకపూర్​ను హీరోయిన్​గా తీసుకోవాలని అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే మహేశ్​ సినిమాలో ఇద్దరు బాలీవుడ్ భామల సందడి​ సినిమాకే హైలెట్​గా నిలస్తుంది. కాగా, వచ్చే ఏడాది ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయని సమాచారం. విజువల్‌ ఎఫెక్ట్స్‌కు అధిక ప్రాధాన్యత ఉండే ఈ పాన్‌ ఇండియా సినిమాకు రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ కథ అందిస్తున్నారు.