ఏలూరులో ర్యాగింగ్ కలకలం..నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య యత్నం..!

Raging commotion in Eluru..Nursing student attempted suicide..!
Raging commotion in Eluru..Nursing student attempted suicide..!

ఏలూరు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య యత్నం చేసుకుంది. ఫస్ట్ ఇయర్ చదువుతున్న నర్సింగ్ విద్యార్థిని సీనియర్ విద్యార్థినిలు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య యత్నం చేసుకుంది.

ప్రస్తుతం ఆస్పత్రిలో బాధిత విద్యార్థిని చికిత్స పొందుతోంది. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నది కళాశాల సిబ్బంది. అయితే.. ఆత్మహత్య యత్నం చేసిన విద్యార్థిని నర్సింగ్ స్టూడెంట్ ప్రమీల అని సమాచారం అందుతోంది. ఈ విషయాన్ని అసలు బయటపెట్టడం లేదు కళాశాల సిబ్బంది. ఇక ఈ సంఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.