ఓటీటీ కి పెరుగుతున్న క్రేజ్….

ఓటీటీ కి పెరుగుతున్న క్రేజ్..... అగ్రీమెంట్స్ చేసుకుంటున్న స్టార్ హీరోలు

ప్రస్తుతం సినిమాలు రిలీజ్ విషయానికి వస్తే చాల వరకు వెబ్ సిరీస్ ని ఎంచుకుంటున్నారు . అందులో మన టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన మాస్ మహారాజా రవితేజ ట్రెండ్ కి తగ్గట్లుగా తన కెరీర్ ని మార్చుకోవడానికి ట్రై చేస్తున్నాడని తెలుస్తోంది. డిజిటల్ వరల్డ్ లో రాబోయే రోజుల్లో వెబ్ కంటెంట్ దే రాజ్యమని భావిస్తున్న నటీనటులు దర్శక నిర్మాతలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఒరిజినల్ మూవీస్ మరియు వెబ్ సిరీస్ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. ఇక స్టార్ హీరో హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్ లలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఇదే ట్రెండ్ లో ఆల్రెడీ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాను నటించిన నిర్మించిన సినిమాలను ఓటీటీలలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సూర్య ప్రొడ్యూస్ చేసిన ‘పొన్మగల్ వందాల్’ ఇప్పటికే రిలీజ్ అవగా.. తాను నటించిన ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమా ఓటీటీ రిలీజ్ కి రెడీ అయింది.అయితే సూర్య ప్రముఖ ఓటీటీతో అగ్రిమెంట్ చేసుకొని వారు నిర్మించే సినిమాల్లో నటించేందుకు ఒప్పందం చేసుకున్నాడని సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇదే ఆఫర్ రవితేజకు కూడా ఇవ్వడానికి ఓటీటీలు రెడీ అయ్యాయట. రవితేజ కూడా దీనికి సానుకూలంగా స్పందించారని కథ బాగుంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని.. అయితే రెమ్యూనరేషన్ లో మాత్రం తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పినట్లుగా ఓటీటీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.