దుమ్ము రేపుతోన్న ‘విక్రమ్’ మూడు రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్….

తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌లైన విక్ర‌మ్ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దుమ్ము రేపుతోంది ఈ చిత్రం మూడు రోజుల్లోనే రూ.150 కోట్ల మేర‌కు వ‌సూళ్ల‌ను సాధించ‌టం అనేది హాట్ టాపిక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది..

ఆదివారం వరకు యూఎస్‌లో రూ.13.43 కోట్లు రాబట్టగా, యూకే, ఆస్ట్రేలియాలో అదే సమయానికి రూ.3.90 కోట్లు, రూ.3.55 కోట్లు వసూలు చేసిందని టాక్‌..రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.55 కోట్లు షేర్ క‌లెక్ష‌న్స్ రాగా మొత్తంగా చూస్తే విక్ర‌మ్ సినిమాకు రూ. 150.28 కోట్ల రూపాయ‌ల గ్రాస్ వ‌సూళ్లు చేస్తున్నట్లు ట్రేడ్ నిపుణులు మరియు పరిశ్రమలోని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి.