శృంగార తారతో ఏకాంతంగా.. వర్మ..

మన ఆర్జీవీ ఏది చేసినా సెన్సేషన్ ఏ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.అసలే అది ఎడారి. అంతా నిర్మానుష్యం.. అదే స్పాట్.. అక్కడే మన రాం గోపాల్ వర్మ. శృంగార తార మియా మాల్కోవాతో ఏకాంతంగా ముచ్చటిస్తున్నాడు. తాజాగా ఈ పిక్ సోషల్ మీడియాలో షేర్ చేసి ఆసక్తికర ట్యాగ్ లైన్ జోడించాడు వర్మ. అయితే అది అలా రిలీజైందో లేదో.. నెటిన్లు వర్మపై ఒకటే సెటైర్స్ పేలుస్తున్నారు. మన సంచలన దర్శకుడు శృంగార తారతో ఏం చేస్తున్నాడు అంటూ రచ్చ రాజుకుంటోంది.

అయితే ‘ఎ షాట్ విత్ మియా మాల్కోవా.. క్లైమాక్స్ సన్నివేశం కోసమే సామాజిక దూరం పాటిస్తూ చర్చిస్తున్నాం’ అంటూ ఆమెతో ఎడారిలో కూర్చొని మాట్లాడుతున్న ఫొటో వదిలాడు రామ్ గోపాల్ వర్మ. ఈ పిక్ చూసిన నెటిజన్స్ ఆసక్తికరంగా కామెంట్స్ గుప్పిస్తున్నారు. ఈ లాక్‌డౌన్‌లో అక్కడ షూట్ ఎలా చేశారు? పర్మిషన్ ఎలా దొరికింది అంటూ కొందరు ప్రశ్నిస్తుంటే.. చాలామంది లైకులు, రీ ట్వీట్స్ చేస్తూ హోరెత్తిస్తున్నారు.

మొత్తానికి పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో గతంలో గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (GST) సినిమాను చేసిన వర్మ ఈ సారి ‘క్లైమాక్స్’ రూపంలో మరో సంచలనానికి తెరలేపారు. కాగా ఈధ్యనే ఈ సినిమా టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసి సోషల్ మీడియాను షేక్ చేశారు. యాక్షన్ థ్రిల్లింగ్ స్టోరీతో శృంగార సన్నివేశాలను నగ్నంగా పండిస్తూ.. రసజ్ఞులను రెచ్చగొట్టేలా వర్మ ఈ ‘క్లైమాక్’ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాను మే 29వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు వర్మ ప్రకటించారు. అలాగే.. #RGVWorldTheatre @shreyaset యాప్‌లో బొమ్మ పడుతుందని వర్మ క్లారిటీ ఇచ్చారు.