ఎంఫాన్ ఎఫెక్ట్.. తక్షణ సాయం కింద వెయ్యి కోట్లు మంజూరు : మోడీ

ఘనంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన 69వ పుట్టిన రోజు వేడుకలు

ఎంఫాన్ తుఫాన్ ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. కాగా ఈ తుఫాన్ కారణంగా ఇప్పటికే 80 మంది మృత్యవాత పడినట్లుగా సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు కూడాను. తాజాగా వెస్ట్ బెంగాల్ లోని దీఘా, బంగ్లాదేశ్ లోని హతియా వద్ద ఎంఫాన్ తుఫాన్ తీరం దాటింది.

అయితే ఈ తుఫాన్ ధాటికి వెస్ట్ బెంగాల్ విపరీతమైన నష్టం వాటిల్లింది. దీఘా జిల్లా, కోల్ కతా ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈరోజు ప్రధాని మోడీ బెంగాల్ పర్యటనలో భాగంగా తుఫాన్ బాధిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వేను నిర్వహించారు. పరిస్థితిని అంచనా వేశారు. తక్షణ సాయం కింద వెస్ట్ బెంగాల్ కు వెయ్యి కోట్లు మంజూరు చేశారు. అలాగే మృతి చెందిన వ్యక్తులకు రూ.2 లక్షల రూపాయల ఆర్ధిక సాయం ప్రకటించారు. గాయాలైన వ్యక్తులకు కేంద్రం రూ. 50 వేల రూపాయల సహాయం అందిస్తున్నట్టు ప్రధాని మోడీ స్పష్టం చేశారు.

కాగా మమత బెనర్జీ ప్రభుత్వం ఎంఫాన్ తుఫాన్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు చేసిన కృష్ణిని ప్రధాని మోడీ అభినందించారు. ఇప్పటికే దేశం కరోనా దెబ్బకు విలవిలలాడిపోతూ.. కరోనా కేసులు పెరిగిపోతున్న ఈ నేపథ్యంలో ఎంఫాన్ వంటి పెను తుఫాన్ అల్లకల్లోలం సృష్టించడం చాలా విచారకరమని విశ్లేషకులు భావిస్తున్నారు.