తమన్‌ 100వ సందడి కనిపించలేదేం…?

100 Films In 10 Years

తన 100 సినిమాలు పూర్తి చేసుకున్నట్లుగా ప్రకటించాడు. తాజాగా ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘అరవింద సమేత’ చిత్రం తన వందవ సినిమా అంటూ సంచలన ప్రకటన చేసి అందరికి షాక్‌ ఇచ్చాడు. మామూలుగా సంగీత దర్శకుడి వంద సినిమా అంటే ఆడియో విడుదల వేడుక సందర్బంగా మరియు సినిమా పోస్టర్ల మీద ఆయన పేరు, ఫొటో కనిపిస్తాయి. కాని అరవింద సమేత చిత్రం విడుదల సమయంలో కాని, పోస్టర్‌లపై కాని తమన్‌ ఫొటో కనిపించలేదు. అందుకు కారణం ఏంటో కాని, తమన్‌ తన వంద సినిమా పబ్లిసిటీని పెద్దగా చేసుకోలేక పోయాడు. గతంలో తమన్‌ 50వ సినిమాగా ‘ఆగడు’ విడుదల అయ్యింది. ఆ సమయంలో పెద్ద ఎత్తున సందడి చేశారు. 50వ సినిమా అంటూ ఆడియో విడుదల కార్యక్రమంలో ప్రతి ఒక్కరు తమన్‌ను అభినందించారు. అలా తమన్‌ను 100వ సినిమా సమయంలో కూడా ప్రత్యేకంగా సన్మానిస్తే బాగుండేది అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.

thaman

అరవింద సమేత చిత్రం తన వందవ సినిమా అంటూ తాజాగా ప్రకటించిన తమన్‌ ఎందుకు అప్పుడు చెప్పలేదు అనే చర్చ జరుగుతుంది. ఏ నటుడికైనా, టెక్నీషియన్‌కు అయినా కూడా 100వ సినిమా అంటే చాలా చాలా ప్రత్యేకం. కాని తమన్‌ మాత్రం చాలా సింపుల్‌గా అరవింద తన 100వ సినిమా, ఆ సినిమా సక్సెస్‌ అయినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ ప్రకటించాడు. అరవింద సమేత తన 100వ సినిమా కాగా త్వరలో రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రాబోతున్న అమర్‌ అక్బర్‌ ఆంటోనీ చిత్రం నా 101వ చిత్రం అంటూ తమన్‌ ప్రకటించడం అందరికి ఆశ్చర్యంను కలిగిస్తోంది. అమర్‌ అక్బర్‌ ఆంటోనీ సమయంలో అయినా 101వ చిత్రం అంటూ తమన్‌ సందడి చేస్తాడేమో చూడాలి. తెలుగులో తమన్‌ మొదటి సినిమా ‘కిక్‌’ కాగా ఇప్పుడు 101వ చిత్రం కూడా రవితేజతో వర్క్‌ చేస్తున్న కారణంగా సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

ss-thaman-music