మలక్‌పేటలో 108 వాహనం డోర్లు తెరుచుకోక వ్యక్తి మృతి

108 Vehicle doors Jammed in Malakpet and one man died

అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడే అంబులెన్స్‌ ఓ వ్యక్తి మృతికి కారణమైంది. అరుదైన ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. బేగంపేట దగ్గర లోకల్‌ ట్రైన్‌ ఎక్కాడో ఓ వ్యక్తి. మార్గమధ్యంలోనే ఆయనకు గుండెపోటు వచ్చింది.

వెంటనే అలర్టయిన తోటి ప్రయాణికులు 108కి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మలక్‌ పేట్ స్టేషన్‌లో అతన్ని అంబులెన్స్‌ ఎక్కించే ప్రయత్నం చేశారు.

ఐతే 108 డోర్లు ఎంతకీ తెరుచుకోలేదు. సిబ్బంది ఎంత ప్రయత్నించినా ఓపెన్ కాలేదు. అక్కడే అరగంట గడిచిపోయింది. వైద్యం అందడం ఆలస్యమవ్వడంతో అక్కడే ప్రాణాలు కోల్పోయాడు ఆ వ్యక్తి.