తండ్రిని ముక్కలుగా చేసి చంపిన కొడుకు…అరెస్ట్ 

Son arrested for slaying father

మాల్కాజిగిరిలో తండ్రిని ముక్కలు ముక్కలుగా నరికిన కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  మూడు రొజుల క్రితం తండ్రిని ముక్కలు గా నరికిన కేసును పోలీసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

తండ్రి కొడుకుల మధ్య ఎర్పడిన స్వల్ప వివాదంతో  తండ్రి మారుతిని అతి కిరాతకంగా హత్య చేశాడు కొడుకు కిషన్. తండ్రి మారుతిని చంపిన తరువాత డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికి వేసి ఆరు బాకెట్ల ల్లో మృతిదేహాన్ని పెట్టాడు.

ఈ సమయంలో తల్లితో పాటుగా సొదరి కూడా వున్నారు. అయితే తల్లి, సొదరితో కలిసి కిషన్ ఈ హత్య చేసి వుంటారన్న కొణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

మూడు రొజుల క్రితం ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఈ హత్య విషయం వెలుగులోకి వచ్చింది.  పోలీసులు వెళ్లి బాతూంలో దాచి పెట్టిన  ఆరు బాకెట్లులో వున్న మృతిదేహాం ముక్కలను స్వాధీన పరుచుకున్నారు.

హత్య వెలుగులోకి వచ్చిన తరువాత  కిషన్ తో పాటుగా తల్లి, సొదరి కనిపించ కుండా పొయారు. పరారీలో  వున్న కిషన్‌ను పోలీసులు  అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.