కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన 8వ తరగతి విద్యార్థిని

కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన 8వ తరగతి విద్యార్థిని

మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో 8వ తరగతి చదువుతున్న స్కూల్ విద్యార్థిని కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించింది. త్వరలో ఈ అవకాశం ప్రతి విద్యార్థినికి లభిస్తుందని ఆ జిల్లా కలెక్టర్ సుమన్ రావత్ చంద్ర ఈ సందర్భంగా వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో ఆమెకు ఈ అవకాశం ఇచ్చామని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె.. ఓ విద్యార్థిని తన సీట్లో కుర్చొని విధులు నిర్వహిస్తున్న ఫొటోను ట్వీట్ చేశారు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన 8వ తరగతి విద్యార్థిని - Telugu Bullet

మహిళా దినోత్సవంలో భాగంగా చదువుల్లో బాగా రాణించే విద్యార్థినీలను ఎంపిక చేసి ఒక రోజు కలెక్టరుగా విధులు నిర్వహించే అవకాశాన్ని కల్పిస్తామని సుమన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో జిల్లా పరిషద్ స్కూల్‌లో చదువుతున్న పూనమ్ దేశ్‌ముఖ్ అనే విద్యార్థినికి కలెక్టర్‌‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశం కల్పించారు. ఈ ట్వీట్ చూసిన నెటిజనులు సంతోషంతో ఉప్పొంగుతున్నారు. మీరు చాలా మంచి పని చేస్తు్న్నారని కలెక్టర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. అమ్మాయిలు జీవితంలో మంచి స్థానాల్లో ఉండాలంటే.. ‘ఎంపవరింగ్, ఎడ్యుకేటింగ్, ఎంకరేజింగ్’ వంటివి చాలా ముఖ్యమైనవని.. ఇందుకు మీరు పునాది వేశారని పేర్కొంటున్నారు. ఇంకా ఎవరెవరు ఏమంటున్నారనేది ఈ కింది ట్వీట్లలో చూడండి.