‘హనుమాన్’ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్

‘హనుమాన్’ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్
Latest News

కొత్త స్టోరీస్ తో ఆకట్టుకునే టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటిస్తున్న సూపర్ నాచురల్ చిత్రం హనుమాన్. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ఈ హనుమాన్ సినిమా. ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయ్. ఇక టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘హనుమాన్’ మూవీ ప్రమోషన్స్ మొదలు పెడుతున్నట్లు మేకర్స్ ప్రకటించేసారు .

‘హనుమాన్’  మూవీ నుంచి స్పెషల్ పోస్టర్
Hanuman Movie

గణనాథుడి ఆశీస్సులతో ప్రమోషన్స్ స్టార్ట్ చేశామని తెలియచేస్తూ …వినాయక చవితి పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న 11 భాషల్లో రిలీజ్ అవుతుందని వెల్లడించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ మూవీ పై భారీ అంచనాలు పెంచేసింది. కాగా, అమృత అయ్యర్ లేడీ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్,వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను, సత్య తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.