జక్కన్న ఫ్యామిలీ ‘ఆకాశవాణి’ కథేంటీ…?

Aakashavani First Look Motion Teaser

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి కుటుంబంకు చెందిన వారు అంతా కూడా సినిమా పరిశ్రమలోనే ఉన్న విషయం తెల్సిందే. ఏదో ఒక రంగంలో సినిమా పరిశ్రమకు దగ్గరగా ఉంటూ వస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ మల్టీస్టారర్‌ను తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఆయన కొడుకు ‘ఆకాశవాణి’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నట్లుగా ప్రకటించాడు. రాజమౌళి శిష్యుల్లో ఒక్కడైన వ్యక్తి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. రాజమౌళి తనయుడు కార్తీకేయ ఈ చిత్రంను చాలా విభిన్నంగా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రం పోస్టర్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్‌ సభ్యులు చిత్రంపై అంచనాలు పెంచుతున్నారు.

rajamouli-Karthikeya

ఆకాశవాణి అనే టైటిల్‌కు తగ్గట్లుగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడం జరిగింది. చాలా విభిన్నంగా ఉండబోతుందని ఈ చిత్రం పోస్టర్‌ చూస్తుంటే అనిపిస్తోంది. భారీ ఎత్తున అంచనాల నడుమ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లుగా తెలుస్తోంది. కీరవాణి తనయుడు కాభైరవ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించబోతున్నాడు. కాలభైరవ ఇప్పటి వరకు సింగర్‌ గా మంచి పాటలు పాడి మెప్పించాడు. ఇప్పుడు సంగీత దర్శకుడిగా మెప్పిస్తాడని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఈ చిత్రం ఫాంటసీ నేపథ్యంలో సాగే కథ అని, తప్పకుండా ఇది ప్రేక్షకులకు సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రంను త్వరలోనే పట్టాలెక్కించబోతున్నారు. ఈ చిత్రం జక్కన్న స్టైల్‌లో భారీగా ఉండే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.