బాబోయ్‌.. శర్వా మూవీకి ఎందుకు ఇంత రేటు

Padi Padi Leche Manasu Movie Updates

యంగ్‌ హీరో శర్వానంద్‌, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న ‘పడి పడి లేచే మనసు’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రికార్డు స్థాయిలో అంచనాలున్న ఈ చిత్రంకు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈయన గత చిత్రం ‘లై’ ఫ్లాప్‌ అవ్వడంతో ఈ చిత్రం ఎలా ఉంటుందో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే సినిమా బాగుంటుందనేలా టీజర్‌ ఉంది. దాంతో మంచి ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేస్తోంది. ఇప్పటికే అన్ని ఏరియాల్లో కూడా ఈ చిత్రం మంచి బిజినెస్‌ చేసినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌తోనే చిత్ర నిర్మాతకు తను పెట్టిన పెట్టుబడి రికవరీ కాబోతుందని సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

padi-lechave

ఈ చిత్రం శాటిలైట్‌ రైట్స్‌ తాజాగా అమ్ముడు పోయాయి. తెలుగు శాటిలైట్‌ రైట్స్‌తో కలిపి హిందీ, తమిళ భాషల శాటిలైట్‌ రైట్స్‌కు గాను 12 కోట్ల రేటు పలికినట్లుగా తెలుస్తోంది. యంగ్‌ హీరో మూవీ, అది కూడా శర్వానంద్‌ ఒక హీరో మూవీకి ఈస్థాయి రేటు పలకడం చాలా గొప్ప విషయంగా సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమాను 20 కోట్ల లోపు బడ్జెట్‌తోనే రూపొందిస్తున్నట్లుగా సమాచారం అందుతున్న నేపథ్యంలో నిర్మాతకు మంచి టేబుల్‌ ఫ్రాఫిట్‌ ఖాయంగా కనిపిస్తోంది. తప్పకుండా ఈ చిత్రం విజయాన్ని సాధిస్తుందనే నమ్మకంతోనే అన్ని ఏరియాల్లో ఇంత భారీగా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేస్తుందని అంటున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ చిత్రీకరణ జరుపుతున్నారు. డిసెంబర్‌లో సినిమాను విడుదల చేయబోతున్నారు. సాయి పల్లవి ఈ చిత్రంలో ఉండటం వల్ల ఈ స్థాయిలో బిజినెస్‌ అవుతుందనే వారు కూడా లేకపోలేదు.