ఫ్లాప్‌ మూవీకి సీక్వెల్‌ అవసరమా దేవా…?

Abhinitri Movie Sequel For Deva

సూపర్‌ హిట్‌ చిత్రాలకు సీక్వెల్‌ చేస్తే బాగుంటుంది. తప్పకుండా ఆ సీక్వెల్‌ చిత్రాలు సక్సెస్‌ అవుతాయి. కాని ఏమాత్రం ఆకట్టుకోలేని చిత్రాలకు సీక్వెల్‌ చేస్తే ఎవరు చూస్తారు. ఇప్పటి వరకు వచ్చిన సీక్వెల్స్‌ దాదాపు అనిన కూడా సక్సెస్‌ చిత్రాలకు వచ్చినవే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి సారి ప్రభుదేవా తాను చేసిన ‘అభినేత్రి’ అనే ఫ్లాప్‌ చిత్రానికి సీక్వెల్‌ చేసేందుకు సిద్దం అవుతున్నాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుపుతున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు. విజయ్‌ దర్శకత్వంలో సీక్వెల్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ను జరుపుతున్నట్లుగా ప్రభుదేవా తాజాగా అధికారికంగా ప్రకటించాడు.

prabhu-deva

తెలుగు, తమిళం, హిందీల్లో విడుదలైన ‘అభినేత్రి’ చిత్రం ఏ భాషలో కూడా సక్సెస్‌ను దక్కించుకోలేక పోయింది. ఆ చిత్రంలో తమన్నా ద్విపాత్రాభినయం చేసింది. దెయ్యం కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఆ చిత్రం బడ్జెట్‌ను అయినా రికవరీ చేసిందో లేదో. ప్రభుదేవాకు కూడా అభినేత్రి పెద్దగా బాలీవుడ్‌లో క్రేజ్‌ను పెంచినది లేదు. అయినా కూడా ప్రభుదేవా ఎంతో ముచ్చటపడి మరీ సీక్వెల్‌కు సన్నాహాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభుదేవా చేస్తున్న చిత్రం పూర్తి అయిన వెంటనే అభినేత్రి సీక్వెల్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది. వచ్చే ఏడాదిలో మొదటి పార్ట్‌ విడుదలైన విధంగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సీక్వెల్‌ను కూడా విడుదల చేయాలని ప్రభుదేవా భావిస్తున్నాడు. అభినేత్రి సీక్వెల్‌లో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా ఉంది. మళ్లీ తమన్నాతోనే ప్రభుదేవా పని కానిచేస్తాడా లేదంటే మరో హీరోయిన్‌ను తీసుకుంటాడా అనేది చూడాలి.

prabu-deva