జూనియర్‌ బచ్చన్‌ హుందాతనం

జూనియర్‌ బచ్చన్‌ హుందాతనం

ప్రముఖ బాలీవుడ్  నటుడు, నిర్మాత, నేపథ్య గాయకుడు అభిషేక్ బచ్చన్ ఇటీవల ట్విటర్‌లో చేసిన పోస్ట్‌ పై ఓ నెటిజన్‌ ఆయనను ట్రోల్‌ చేశాడు. కాగా ఈ జూనియర్‌ బచ్చన్‌ తనపై వచ్చిన ట్రోల్‌ను హుందాగా స్వీకరిస్తూ దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చి ఆకట్టుకున్నారు. అభిషేక్ బచ్చన్ ఇచ్చిన సమాధానం గొప్పగా ఉంది అంటూ ట్విటర్ లో కామెంట్లు చాలా వస్తున్నాయి.

సినిమాలకి విరామం ఇచ్చి ఇష్టమైన ప్రాజెక్టులపై అభిషేక్‌ బచ్చన్‌ పని చేస్తున్నారు.  ఆశయం లక్ష్యంతో పనిచేసినపుడు ఏదైనా సాదిస్తామని అభిషేక్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేయగ దీనిపై ఓ నెటిజన్‌ కామెంట్‌ చేస్తూ జూనియర్‌ బచన్‌ను నిరుద్యోగిగా పేర్కొన్నాడు.

నెటిజన్‌ కామెంట్‌లో ఒక వ్యక్తి సోమవారం కూడా విశ్రాంతి తీసుకుంటే తనని నిరుద్యోగి అంటారు అని పేర్కొన్నాడు. అభిషేక్ బచ్చన్ హుందాగా బదులిస్తూ కొందరు ఏ పని చేసినా చేసే పనిని ప్రేమిస్తారు, మీ అభిప్రాయంతో నేను ఏకీభవించను అని  తెలిపారు.