సినిమా ఇండ‌స్ట్రీలో 60ఏళ్లు పూర్తిచేసిన‌ “ఇండియ‌న్”

సినిమా ఇండ‌స్ట్రీలో 60ఏళ్లు పూర్తిచేసిన‌

బహుముఖ ప్రజ్ఞగల నటుడు క‌మ‌ల్ హాస‌న్ ముక్యంగా దక్షిణ భారత తమిళ చిత్రాలలో నటించినప్పటికీ భారత దేశ మంతటా పేరు తెచ్చుకున్న గొప్ప నటుడు. కమల్ తన సినీ జీవితాన్ని కలత్తూర్ కన్నమ్మ అనే చిత్రంలో బాల నటుడిగా ఐదేళ్ల వయసులోనే తెరంగరేటమ్ చేశారు.

శంక‌ర్ దర్శకత్వంలో క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో రానున్న చిత్రం “ఇండియ‌న్ 2”. తెలుగు, తమిళం, హిందీ భాషల్లోఈ చిత్రాన్ని ఏక కాలంలో చిత్రీకరిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ భారీ 180 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.కీలక పాత్రలో దుల్కర్‌ సల్మాన్‌, అజయ్‌ దేవ్‌గణ్‌ ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. కాజల్ కమల్‌హాసన్‌కి జోడీగా నటిస్తున్నారు. ముఖ్యపాత్రలో శింబు కూడా నటించనున్నారని సమాచారం.

చిత్రానికి సంగీతం అనిరుధ్ సమకూర్చుతున్నారు. క‌మ‌ల్ హాస‌న్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఇంకా సినిమా ఇండ‌స్ట్రీలో ప్ర‌వేశించి 60సంవ‌త్స‌రాలు పూర్తి చేసిన‌ సందర్బంలో చెన్నైలో ఘ‌నంగా కార్య‌క్ర‌మాల ఏర్పాటు జరుగుతున్నాయి. కొద్ది రోజులుగా షూటింగ్ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, గ్వాలియ‌ర్‌ల‌లో చేస్తున్నారు. చిత్ర షూటింగ్ కొత్త షెడ్యూల్ కూడా మొదలు పెట్టనున్నారు. ఐశ్వర్య రాజేశ్, విద్యుత్ జమ్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ ముక్య పాత్రల్లో నటిస్తున్నారు.