స్నేహమే అని చెప్తున్న రకుల్‌

స్నేహమే అని చెప్తున్న రకుల్‌

ఈ ఏడాది బాలీవుడ్లో దేదేప్యార్‌దే తో సూపర్‌ హిట్‌ సాదించిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తర్వాత సినిమ మర్జావాన్‌ సినిమా విడుదల కానుంది. వేరే భాషలలొ అవకాశాలు తగ్గిన ప్రత్యేకంగా ఫొటోసెషన్స్‌ చేసుకుని ఫొటోలను తన సోషల్ మీడియా ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేస్తూ ఇంకా వార్తల్లో మాత్రం ఎక్కువగానే ఉంటోంది. ఈ బ్యూటీ టాలీవుడ్‌నటుడు రానా ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.

రకుల్‌ప్రీత్సింగ్‌ ప్రేమలో పడిందని, అవకాశాలు తగ్గడంతో పెళ్లి ఆలోచనలో పడిందని ప్రచారం జరుగు తుంది. దీనిపై స్పందిస్తూ రకుల్‌ప్రీత్‌సింగ్‌ మాత్రం నటనకు అవకాశం ఉన్న పాత్రలైతేనే నటిస్తున్నానని చెప్తుంది. ముందు టాలీవుడ్‌లో చాలా బిజీగా ఉన్న రకుల్ ఇప్పుడు ఒక్క అవకాశం లేని పరిస్థితిలో ఉంది. కోలీవుడ్‌లో నటుడు కార్తీ, ఆయన సోదరుడు సూర్యతో నటించిన చిత్రాలు అంతాపెద్దగా హిట్ సాదించ లేదు. శంకర్‌ దర్శకత్వంలో కమలహాసన్‌తో ఇండియన్2లో అవకాశం దక్కింది.

ఒక భేటీలో పేర్కొంటూ నటుడు రానాకు తనకు మధ్య ప్రేమ అనేది అబద్ధంఅని స్పష్టం చేస్తూ వారి ఇద్దరి ఇళ్లు చాలా దగ్గరలో ఉన్నాయని సినీ రంగంలోకి వచ్చినప్పటి నుంచే రానా తనకు తెలుసని ఎప్పుడూ డేటింగ్‌ చేయలేదని చెప్పుకొచ్చింది. నటించిన నటులందరితోనే స్నేహంగా ఉంటానని, రానా తోనూ ఉన్నది స్నేహంమే అని ప్రేమ కాదని ఇంత వరకూ ఎవరినీ ప్రేమించలేదని తెలిపింది.