రకుల్‌ కావాలనే చెర్రీకి నో చెప్పిందా…?

Rakul Preet Singh Item Song In Ram Charan Boyapati Movie

గత ఏడాది అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఇప్పుడు తెలుగులో పెద్దగా అవకాశాలు లేవనే చెప్పవచ్చు. తెలుగులో అంతగా అవకాశాలు లేకున్నా కూడా తమిళంలో మాత్రం వరుస చిత్రాల్లో నటిస్తూనే ఉంది. తెలుగు చిత్రాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న రకుల్‌ తాజాగా చెర్రీకి నో చెప్పినట్టు టాక్‌ వినిపిస్తోంది. చెర్రీతో రెండు చిత్రాల్లో కలిసి నటించిన ఈ అమ్మడు ఎందుకు నో చెప్పిందా అనే సందేహాలు కలుగుతాయి. రకుల్‌కు చెర్రీ సినిమాలో హీరోయిన్‌గా కాకుండా ఐటెంగా చిందులేయడానికి ఛాన్స్‌ వచ్చింది. ఐటెంగా చేయడం ఇష్టం లేదనుకున్నా ఈ అమ్మడు బిజీ అంటూ నో చెప్పిందని టాక్‌ వినిపిస్తోంది.

rakul-preet-singh

చెర్రీతో ప్రత్యేక పాటలో చిందులేస్తే మళ్లీ అవకాశాలు పెరిగే ఛాన్స్‌ ఉండేది అని అభిమానులు వాపోతున్నారు, కానీ ఈ అమ్మడు డేట్స్‌ లేవంటూ నిర్మొహమాటంగా నో చెప్పిందట. దాంతో ఇక చేసేది లేక బోయపాటి బాలీవుడ్‌ కథానాయికను ప్రత్యేక పాట కోసం గాలిస్తున్నాడు. ఈ పాటకు స్టార్‌ హీరోయిన్‌ కావాలనుకున్న బోయపాటి ప్రస్తుతం రకుల్‌ అంతగా బిజీ కాదు కాబట్టి ఈమెను సంప్రదించాడట. కానీ ఐటెం పాట ఇష్టం లేకపోవడంతో ఈ అమ్మడు నో చెప్పగానే బాలీవుడ్‌ బ్యూటీలను సంప్రదిస్తున్నారు చిత్ర యూనిట్‌. చరణ్‌, బోయపాటి ఈ చిత్ర షూటింగ్‌ ప్రస్తుతం చివర దశకు చేరుకుంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో చరణ్‌ సరసన కియారా అద్వానీ నటిస్తోంది.

rakul-ram