లక్కీ బ్యూటీ… మహేష్‌, చరణ్‌లతో ఒకేసారి

Amyra Dastur act as Heroine in Mahesh and Charan Movies

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
హీరోయిన్‌గా సక్సెస్‌ అవ్వాలంటే కనీసం ముగ్గురు నలుగురు చిన్న హీరోలతో సినిమాలు చేసి, ఆ తర్వాత స్టార్‌ హీరోల సరసన నటించి అప్పుడే స్టార్‌గా గుర్తింపు దక్కించుకుంటారు. అయితే అమైరా దస్తూర్‌ మాత్రం తెలుగులో ఒక్క సినిమా కూడా చేయకుండానే స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. బాలీవుడ్‌లో మంచి ఫేం ఉన్న అమైరా దస్తూర్‌ ప్రస్తుతం మహేష్‌బాబు, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘భరత్‌ అను నేను’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు రాకముందే అప్పుడే మరో సినిమాను అమైరా దస్తూర్‌ తెలుగులో దక్కించుకుంది.

మహేష్‌బాబుతో ‘భరత్‌ అను నేను’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న అమైరా దసూర్‌ను తాజాగా బోయపాటి శ్రీను తన తర్వాత సినిమా కోసం బుక్‌ చేయడం జరిగింది. రామ్‌ చరణ్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే లాంచనంగా జరిగాయి. త్వరలోనే సినిమాను రెగ్యులర్‌ షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభం అయ్యింది.

ప్రస్తుతం రంగస్థలం చిత్రం షూటింగ్‌లో ఉన్న చరణ్‌ ఆ వెంటనే బోయపాటి సినిమాను పూర్తి చేయబోతున్నాడు. రాజ వంశంకు చెందిన వ్యక్తిగా చరణ్‌ ఈ చిత్రంలో కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. చరణ్‌కు జోడీగా అమైరా దస్తూర్‌ ఎంపిక అయ్యింది. తెలుగులో వరుసగా రెండు పెద్ద సినిమాల్లో నటిస్తున్న అమైరా దస్తూర్‌ టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.