‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ టీజర్‌ ఇలా ఉండబోతుందట

Interesting update on Balakrishna's NTR biopic teaser

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలుగు వారి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా బాలకృష్ణ ‘ఎన్టీఆర్‌’ చిత్రాన్ని చేయబోతున్న విషయం తెల్సిందే. తేజ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే అయ్యాయి. ఎన్టీఆర్‌ పాత్రను బాలకృష్ణ పోషించబోతున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే నెలలో ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్బంగా టీజర్‌ను విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో బాలయ్య చాలా హడావుడిగా చిత్రీకరణ ప్రారంభించారు. బాలయ్య ప్రస్తుతం టీజర్‌ను రెడీ చేయించే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

నిన్న మొన్నటి వరకు టీజర్‌లో ఎన్టీఆర్‌గా బాలయ్య లుక్‌ రివీల్‌ అయ్యే అవకాశం ఉందని అంతా భావించారు. అయితే టీజర్‌లో లుక్‌ రివీల్‌ చేయడం లేదని సమాచారం అందుతుంది. బాలయ్య ఎన్టీఆర్‌ గెటప్‌లో కాషాయ దుస్తులు ధరించి, తల పాగా పెట్టుకుని ఉండి నా తెలుగింటి ఆడపడుచుల్లారా, తమ్ముళ్లారా.. అంటూ డైలాగ్‌ ఉంటుందని, ఆ తర్వాత తెలుగు వారి దైవం ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర సినిమా షూటింగ్‌ ప్రారంభం అంటూ టీజర్‌లో ఉండబోతుంది. మొత్తం 30 లేదా 40 సెకన్ల పాటు టీజర్‌ ఉంటుందని సమాచారం. ప్రస్తుతానికి టీజర్‌ కోసం షూటింగ్‌ చేశారు. ప్రస్తుతం ఎడిటింగ్‌ చేసి, కాస్త విజువల్‌ ఎఫెక్ట్స్‌ను యాడ్‌ చేయబోతున్నారు. రెగ్యులర్‌ షూటింగ్‌ వచ్చే వేసవిలో ఉంటుందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.