బోయపాటికి మరీ ఇంతనా?

Ram Charan Next high Budget Action Movie WIth Boyapati Srinu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

యాక్షన్‌ చిత్రాలకు పెట్టింది పేరైన దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రస్తుతం రామ్‌ చరణ్‌తో ఒక చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంపై అప్పుడే విపరీతమైన హైప్‌ క్రియేట్‌ అయ్యింది. హిందీ డబ్బింగ్‌ రైట్స్‌ ఏకంగా 25 కోట్లకు అమ్ముడు పోవడంతో పాటు ప్రైమ్‌ వీడియో, ఇతర ఏరియాల డిస్ట్రిబ్యూషన్‌ రైట్స్‌ ద్వారా రికార్డు స్థాయిలో ఈ చిత్రం బిజినెస్‌ చేసినట్లుగా తెలుస్తోంది. సినిమా ప్రారంభం అవ్వగానే సినిమా ఇంత భారీగా బిజినెస్‌ చేస్తున్న నేపథ్యంలో బోయపాటి శ్రీను పారితోషికం కూడా అదే స్థాయిలో ఉందని సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

రామ్‌ చరణ్‌ సినిమా అంటే అంచనాలు ఆకాశాన్ని అంటేలా ఉంటాయి. అందుకే బోయపాటి శ్రీను ఒక అద్బుతమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం కోసం బోయపాటి ఏకంగా 15 కోట్ల పారితోషికాన్ని అందుకోబోతున్నాడు. టాలీవుడ్‌లో పది కోట్లకు మించి పారితోషికం అందుకుంటున్న వారు చాలా తక్కువ. అలాంటిది చరణ్‌ సినిమాకు బోయపాటి ఏకంగా 15 కోట్ల పారితోషికం తీసుకుంటుండం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా ఉంది. బోయపాటి గత చిత్రం జయ జానకి నాయక చిత్రం యావరేజ్‌గా నిలిచింది. అయినా కూడా 15 కోట్ల పారితోషికం అందుకోవడం అంటే మామూలు విషయం కాదు.