చరణ్‌తో చిందులేయనున్న బాలీవుడ్‌ బ్యూటీ…?

Bollywood Beauty Item Song Ram Charan Boyapati Srinu Movie

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ‘ధృవ’, ‘రంగస్థలం’ చిత్రాలతో వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్నాడు. చరణ్‌ ప్రస్తుతం బోయపాటి శ్రీనివాస్‌ దర్శకత్వంలో నటిస్తున్నాడు. షూటింగ్‌ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ చిత్రంలో చెర్రీతో కియారా అద్వానీ రొమాన్స్‌ చేస్తోంది. ‘వినయ విధేయ రామా’ అనే టైటిల్‌ను ఈ చిత్రం కోసం యూనిట్‌ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి మంచి ఐటం సాంగ్‌ ఉంటే బావుంటదని, మాస్‌ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ పాటను తెరకెక్కించాలని బోయపాటి ప్లాన్‌ చేస్తున్నాడు.

ప్రత్యేక పాట గురించి బోయపాటి దేవిశ్రీకి చెప్పగా దేవిశ్రీ అందుకు తగిన ట్యూన్స్‌ రెడి చేసే పనిలో పడ్డాడని తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో ఐటెంగా ఎవరు చిందులేస్తారనేది ఇంకా క్లారిటీ లేదు. బాలీవుడ్‌ భామతో ఈ చిత్రంలో చెర్రీ సరసన చిందులేయించాలని బోయపాటి భావిస్తున్నాడు. త్వరలోనే ఆ బాలీవుడ్‌ హాట్‌బ్యూటీ పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. బాలీవుడ్‌ భామ ప్రత్యేక పాటలో పాల్గోనడం ఈ చిత్రానికి పెద్ద ప్లస్‌ అవుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. చరణ్‌ నటించిన ‘రంగస్థలం’ భారీ సక్సెస్‌ సాధించి తాజాగా బుల్లితెరపై కూడా చరణ్‌ ఈ చిత్రానికి లేని విధంగా రికార్డు స్థాయిలో టీఆర్‌పీ రేటింగ్స్‌ను సొంతం చేసుకుంది. దాంతో ఈ చిత్రంపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.

RamCharan Boyapati Srinu Upcoming Film Is Slated For A Pongal Release