చరణ్‌ అభిమానులకు శుభవార్త…!

Ram Charan And Boyapati Srinu Movie First Look Release On Deepavali

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్నాడు. చెర్రీ నటించిన ‘ధృవ’, ‘రంగస్థలం’ చిత్రాలు మంచి సక్సెస్‌ను సాధించడంతో తదుపరి చిత్రంపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. అంతేకాకుండా చెర్రీ బోయపటి శ్రీను దర్శకత్వంలో తదుపరి చిత్రాన్ని ప్లాన్‌ చేయడంతో అభిమానులతో పాటు సినీ వర్గాల్లో కూడా చరణ్‌ ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ వైజాగ్‌లో జరుగుతోంది. ఇంకో 30 రోజుల్లో చిత్రీకరణ పూర్తి అవుతుంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తున్నారు.

ram

‘రంగస్థం’ చిత్రంలో చిట్టిబాబుగా అదరగొట్టిన చెర్రీ ఈ చిత్రంలో ఎలా ఉండబోతున్నాడు అనేది ఆసక్తిగా మారింది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. దాంతో చిత్ర యూనిట్‌ దీపావళికి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడానికి సిద్దమవుతున్నారు. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను దీపావళి సందర్బంగా విడుదల చేయబోతున్నట్టు చిత్ర యూనిట్‌ వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఫస్ట్‌లుక్‌ రాబోతుందనగానే మెగా అభిమానులు ఫుల్‌ ఖుషీగా ఫీల్‌ అవుతున్నారు. ఈ చిత్రంలో చరణ్‌ సరసన కియారా అద్వానీ రొమాన్స్‌ చేస్తోంది.

ram-charan-boyapati