ప్రిన్స్‌ లుక్‌ కోసం చరణ్‌ కష్టాలు

ram charan getting shape Rajavamsasthudu film

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ‘రంగస్థలం’ చిత్రం తర్వాత చేయబోతున్న సినిమా ‘రాజవంశస్తుడు’. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. చరణ్‌ లేకుండానే ఒక షెడ్యూల్‌ను పూర్తి చేసిన దర్శకుడు బోయపాటి ప్రస్తుతం చరణ్‌ రాక కోసం ఎదురు చూస్తున్నాడు. ‘రంగస్థలం’ పూర్తి అయిన వెంటనే ఈ చిత్రంలో నటించాల్సి ఉంది. కాని ఆ చిత్రం ప్రమోషన్స్‌ మరియు ఆ సినిమా భారీ విజయాన్ని సాధించిన నేపథ్యంలో సక్సెస్‌ను ఎంజాయ్‌ చేయడంలో చరణ్‌ బిజీగా ఉన్నాడు. ఎట్టకేలకు ఆ సినిమా నుండి చరణ్‌ బయట పడ్డాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను చిత్రం కోసం చరణ్‌ సిద్దం అవుతున్నాడు.

బోయపాటి చిత్రంలో రామ్‌ చరణ్‌ రాజవంశస్తుడిగా కనిపించబోతున్నాడు. ఒక రాజ కుటుంబంలో మిగిలిన చివరి యువ రాజుగా చరణ్‌ నటిస్తున్నట్లుగా సినీ వర్గాల వారు అంటున్నారు. యువ రాజుగా కనిపించేందుకు రామ్‌ చరణ్‌ బాడీని, లుక్‌ను పూర్తిగా మార్చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌కు వ్యక్తిగత ట్రైనర్‌ ప్రస్తుతం రామ్‌ చరణ్‌తో మంచి బాడీ కోసం కసరత్తులు చేయిస్తున్నాడు. త్వరలోనే చరణ్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయబోతున్న చిత్రంలో కొత్త లుక్‌తో షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్‌ బ్యూటీ కైరా అద్వానీని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.