సైరాలో చిట్టిబాబు పాత్ర ఏంటి?

Ram Charan role in Sye Raa Narasimha Reddy movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రాన్ని సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ తన కొణిదెల ప్రొడక్షన్స్‌లో నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ చక చక జరుగుతున్న ఈ సమయంలో సినిమాకు సంబంధించిన ఒక కీలక విషయం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ఒక చిన్న కీలక పాత్రలో రామ్‌ చరణ్‌ కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

బ్రిటీష్‌ వారితో పోరాడి, వీర మరణం పొందే నరసింహారెడ్డి సైన్యంలో ఒక సైనుకుడిగా రామ్‌ చరణ్‌ కనిపిస్తాడు అంటూ సినీ వర్గాల నుండి అనధికారికంగా సమాచారం అందుతుంది. చిరు 150వ చిత్రం ఖైదీ నెం. 150లో చరణ్‌ తలుక్కున మెరిసి రెండు స్టెప్‌లు వేసిన విషయం తెల్సిందే. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే ఇప్పుడు చరణ్‌ మరోసారి తండ్రి సినిమాలో నటించాలని భావిస్తున్నాడు. చరణ్‌ నటిస్తే సక్సెస్‌ అనే సెంటిమెంట్‌ వల్ల మెగా ఫ్యాన్స్‌ కూడా అదే కోరుకుంటున్నారు. మరి ఈ విషయంలో ఎంత నిజం ఉంది అనే విషయం తెలియాలి అంటే దర్శకుడు సురేందర్‌ రెడ్డి క్లారిటీ ఇవ్వాల్సిందే.