ఐటెం విషయంలో అఖిల్‌ 3 తప్పుడు నిర్ణయం!

Farah Karimaee item song in Akhil film

అక్కినేని అఖిల్‌ మొదటి రెండు చిత్రాలు బాక్సాఫీస్‌ ముందు బొక్క బోర్లా పడ్డాయి. ఏమాత్రం ఆకట్టుకోని కథా కథనాలతో ఆ చిత్రాలు తెరకెక్కడంతో ప్రేక్షకులు తిరష్కరించడం జరిగింది. ప్రస్తుతం అఖిల్‌ మూడవ సినిమాను చేస్తున్నాడు. ‘తొలిప్రేమ’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకుని, కమర్షియల్‌ హిట్‌ను వరుణ్‌ తేజ్‌కు అందించిన వెంకీ అట్లూరి ప్రస్తుతం అఖిల్‌ మూడవ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంకు ‘మిస్టర్‌ మజ్ను’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. డిసెంబర్‌కు అటు ఇటుగా ఈ చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. విడుదల తేదీ విషయంలో త్వరలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రంలో ఐటెం సాంగ్‌ను బ్రిటన్‌ బ్యూటీ ఫరా కరిమయితో చేయిస్తున్నారు.

ఈమె తెలుగులో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రంలో గ్రీస్‌ యువ రాణిగా, ధ్రువ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటించింది. ఆ రెండు చిత్రాల్లో కూడా ఆమె పాత్ర నిడివి చాలా తక్కువగా ఉండటం వల్ల పెద్దగా గుర్తింపు రాలేదు. అయినా కూడా వెంకీ అట్లూరి తన చిత్రం కోసం ఆమెను ఐటెం సాంగ్‌ కోసం ఎంపిక చేయడంను కొందరు తప్పుబడుతున్నారు. ప్రస్తుతం స్టార్‌ హీరోయిన్స్‌తో ఐటెం సాంగ్స్‌ చేయిస్తున్న సమయంలో ఇలా వెంకీ ఒక తెలియని అమ్మాయి, అది కూడా బ్రిటీష్‌ అమ్మాయితో చేయించడం వల్ల ఖచ్చితంగా ప్రయోజనం ఉండదు అంటూ చెబుతున్నారు. ఒక స్టార్‌ హీరోయిన్‌తో ఈ ఐటెం సాంగ్‌ చేయించడం వల్ల ఖచ్చితంగా మాస్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకోవచ్చు అని, ఈయన నిర్ణయాన్ని కొందరు తప్పుబడుతున్నారు. వెంకీ నిర్ణయాన్ని అఖిల్‌ మరియు నాగార్జున సమర్ధిస్తూ వచ్చారు. త్వరలోనే టీజర్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అదే సమయంలో సినిమా టైటిల్‌పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.