ఆర్‌ మల్టీస్టారర్‌ ‘సైరా’ మాదిరిగానే..!

Rajamouli RRR is the story of a British period Story

తెలుగు ప్రేక్షకులు మరియు సినీ వర్గాల వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ల మల్టీస్టారర్‌కు సంబంధించిన వార్త రోజు ఏదో ఒకటి వస్తూనే ఉంది. మొన్నటి వరకు సినిమా ఎప్పుడు ప్రారంభం కాబోతుంది, సినిమాలో ఎన్టీఆర్‌, చరణ్‌లు ఎలా కనిపించబోతున్నారు, కథ ఎక్కడకు వచ్చింది ఇలాంటి వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మాత్రం అసలు ఈ మల్టీస్టారర్‌ నేపథ్యం ఏంటీ అనే విషయంపై ఒక పుకారు ఫిల్మ్‌ నగర్‌లో షికారు చేస్తుంది. ఆ షికారును బట్టి చూస్తుంటే ఈ ఆర్‌ మల్టీస్టారర్‌ మూవీ బ్రిటీష్‌ కాలం నాటి నేపథ్యంతో తెరకెక్కబోతుందని తెలుస్తోంది. స్వాతంత్య్రంకు పూర్తి జరిగిన కథతో ఈ చిత్రం ఉంటుందని ప్రచారం జరుగుతుంది. రాజమౌళి అందుకోసం భారీ ఎత్తున సెట్టింగ్స్‌ను నిర్మిస్తున్నాడు. అల్యూమీనియం ఫ్యామిలీ ప్రాంగణంలో భారీ ఎత్తున స్వాతంత్య్రంకు పూర్వం పరిస్థితులతో సెట్టింగ్స్‌ నిర్మిస్తున్నారు.

రాజమౌళి ఒక వైపు ప్రీ ప్రొడక్షన్స్‌ వర్క్‌ నిర్వహిస్తూనే మరో వైపు హీరోల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. స్క్రిప్ట్‌ వర్క్‌ ముగింపు దశకు చేరుకుంది. నవంబర్‌లో చిత్రాన్ని పట్టాలెక్కించే అవకాశం ఉందని అంటున్నారు. ఒక వేళ నవంబర్‌లో వీలు కాని పక్షంలో జనవరి నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ ఉంటుందని సమాచారం అందుతుంది. ఇక ఈ మల్టీస్టారర్‌ నేపథ్యం ‘సైరా’ చిత్రం నేపథ్యంను పోలి ఉందనే టాక్‌ వినిపస్తుంది. చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం స్వాతంత్య్రంకు పూర్వం కథాశంతో తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. స్వాతంత్య్ర ఉద్యమంలో ఉయ్యాలవాడ సాగించిన పోరాటంను సైరాలో చూపించబోతున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి కనిపించబోతున్నాడు. ఇక సైరా చిత్రంలో స్వాతంత్య్ర ఉద్యమంను చూపించగా, ఆర్‌ మల్టీస్టారర్‌ చిత్రంలో మాత్రం స్వాతంత్య్ర ఉద్యమం ఏమీ ఉందడని సమాచారం అందుతుంది. త్వరలోనే ఈ విషయమై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.