ఆర్‌ మల్టీస్టారర్‌ ఈ ఏడాది లేనట్లేనా?

RRR Movie To Be Delayed

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు హీరోలుగా తెరకెక్కబోతున్న భారీ చిత్రాన్ని ఈ సంవత్సరం డిసెంబర్‌లో సెట్స్‌ పైకి తీసుకు వెళ్లబోతున్నట్లుగా నిన్న మొన్నటి వరకు చిత్ర యూనిట్‌ సభ్యులు చెప్పుకొచ్చారు. కాని తాజాగా పరిస్థితులను చూస్తుంటే సినిమా ఈ ఏడాది సెట్స్‌పైకి వెళ్లే అవకాశం లేదు అనిపిస్తుంది. ఇంకా స్క్రిప్ట్‌ వర్క్‌ ఒక దశకు చేరకపోవడంతో పాటు, హీరోయిన్స్‌ ఎంపిక కార్యక్రమం పూర్తి కాలేదు. ఇంకా స్టోరీని ఫైనల్‌ చేయడంలోనే దర్శకుడు రాజమౌళి తలమునకలై ఉన్నట్లుగా సమాచారం అందుతుంది.

RRR-Movie

రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌లు ప్రస్తుతం వారు చేస్తున్న చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆ చిత్రాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఎన్టీఆర్‌ మూవీ దసరాకు విడుదల కాబోతుండగా, చరణ్‌ మూవీ వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతుంది. ఈ రెండు చిత్రాల తర్వాత వారిద్దరు కలిసి నటించేందుకు సిద్దం అవ్వనున్నారు. రాజమౌళి వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత లేదంటే వేసవిలో సినిమాను ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది. ఆలస్యంగా ప్రారంభం కాబోతుంది కనుక సినిమా ముందు నుండి అనుకుంటున్నట్లుగా కాకుండా ఆలస్యంగానే విడుదల అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. జక్కన్న మూవీ ఎంత ఆలస్యం అయితే అంత బాగా వస్తుందనేది ప్రేక్షకుల్లో ఉన్న టాక్‌. అందుకే ఆర్‌ మల్టీస్టారర్‌ లేట్‌ అయినా పర్వాలేదు అని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు.

RRR