రాజమౌళి ఫ్యామిలీకి ఊహించని ప్రమాదం!

Unexpected danger to the Rajamouli family!
Unexpected danger to the Rajamouli family!

టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో తెరకెక్కించిన గ్లోబల్ హిట్ మూవీ “రౌద్రం రణం రుధిరం” (RRR Movie) కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ మూవీ ఇప్పుడుకి కూడా జపాన్ దేశంలో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతూ ఉండగా కొన్ని రోజులు కితమే జక్కన్న అండ్ ఫ్యామిలీ జపాన్ కు వెళ్లారు. మరి రాజమౌళి అక్కడ RRR స్పెషల్ స్క్రీనింగ్ లో పాల్గొని ఆసక్తికరమైన విషయాలను కూడా పంచుకున్నారు.

అయితే తాజాగా జపాన్ లో రాజమౌళి కుటుంబానికి ఒక ప్రమాదం తప్పిన న్యూస్ బయటకి వచ్చింది. రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ పెట్టిన లేటెస్ట్ పోస్ట్ ఒకటి చిన్నపాటి షాక్ ఇచ్చింది. తాము జపాన్ లో ఒక బిల్డింగ్ 28వ ఫ్లోర్ లో ఉన్నామని ఎందుకో బిల్డింగ్ కదులుతున్నటుగా చిన్నగా అనిపించింది అని తెలియచేసారు .

తీరా అది భూకంపం అని తెలిసింది అని మొదటిసారిగా ఒక భూకంపాన్ని తాను అనుభూతి చెందానని తన స్మార్ట్ వాచ్ లో వచ్చిన వార్నింగ్ ను ఫోటో తీసి షేర్ చేసాడు. అలాగే తాను కొంచెం భపడినట్టుగా కూడా తెలిపాడు. దీనితో నెటిజన్స్ రాజమౌళి అండ్ ఫ్యామిలీ సేఫ్ గా ఉండాలని కోరుకుంటూ వెంటనే ఇండియాకి తిరిగి రావాలని కార్తికేయ పోస్ట్ లో తెలియజేస్తున్నారు.

Unexpected danger to the Rajamouli family!
Unexpected danger to the Rajamouli family!