Election Updates: YCP గూటికి చేరిన వంగవీటి నరేంద్ర

Election Updates: Vangaveeti Narendra joins YCP fold
Election Updates: Vangaveeti Narendra joins YCP fold

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో కీలక నేత చేరారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో రాధా–రంగా మిత్రమండలి ఆంధ్ర ప్రదేశ్ ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర చేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పి.వి.మిథున్‌రెడ్డి, రాధా–రంగా మిత్రమండలి సభ్యులు షేక్‌ బాబు, ఇమ్రాన్‌ రజా, పి.నరేంద్ర, నాగశ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా వంగవీటి నరేంద్ర మాట్లాడుతూ వైఎస్సార్ కుటుంబానికి, వంగవీటి కుటుంబానికి మంచి సంబంధాలున్నాయి అన్నారు. రాధా చేసిన తప్పు నేను చేయకూడదనే వైఎస్సార్సీపీలో చేరానని… బీజేపీ- జనసేన-టీడీపీ కూటమి పూర్తిగా అనైతికం అని తెలిపారు. కూటమి ప్రజల కోసం కాదు.. వారి స్వార్థం కోసం ఏర్పడింది అన్నారు.