అంచనాలు పెంచేస్తున్న కోకో కోకిల

Nayanthara CoCo Kokila Trailer

నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘కోలమావు కోకిల’ ఇటీవలే తమిళనాట విడుదల అయ్యింది. వారం రోజుల్లోనే అక్కడ ఏకంగా 9 కోట్లను వసూళ్లు చేసింది. స్టార్‌ హీరోల చిత్రాలకు ఏమాత్రం తీసిపోకుండా ఈ చిత్రం వసూళ్లు రాబడుతున్న నేపథ్యంలో తెలుగులో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో సినీ వర్గాల వారు ఉన్నారు. ఇక ఈ చిత్రం తెలుగులో ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చిత్రం థియేట్రికల్‌ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేయడం జరిగింది. సినిమాపై అంచనాలను అమాంతం పెంచే విధంగా థియేట్రికల్‌ ట్రైలర్‌ ఉంది అనడంలో ఏమాత్రం సదేహం లేదు. భారీ ఎత్తున ఈ చిత్రంలో ఆసక్తికర ఎలిమెంట్స్‌ ఉన్నట్లుగా ట్రైలర్‌ చూస్తుంటే అనిపిస్తుంది. అందుకే సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.

CoCo Kokila Trailer

ఒక అమాయకపు అమ్మాయిగా నయనతార ఈ చిత్రంలో కనిపించబోతుంది. అమాయకపు అమ్మాయి హత్యలు చేయడం, స్మగ్లింగ్‌ చేయడంను ట్రైలర్‌లో చూపించడం వల్ల కథ ఏంటో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో వ్యక్తం అవుతుంది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం తెలుగులో కూడా విజయాన్ని దక్కించుకుని నయన్‌ స్థాయిని పెంచడం ఖాయంగా సినీ వర్గాల వారు చెబుతున్నారు. తెలుగులో నయనతారకు స్టార్‌డం ఉంది. ఆ స్టార్‌డం కారణంగా కో కో కోకిల చిత్రానికి భారీ ఓపెనింగ్స్‌ దక్కనున్నాయి. ఇక చిత్రం పాజిటివ్‌ టాక్‌ను దక్కించుకుంటే మరింతగా కలెక్షన్స్‌ రావడంఖాయం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.