RRR లో శివగామి…?

Ramya Krishna Grabs A Chance To Act In RRR Movie

రాజమౌళి దర్శకత్వం లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ల మల్టీ స్టారర్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. బాహుబలి చిత్రం తరువాత రాజమౌళి చిత్రం ఏంటి అని అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. జక్కన మల్టీ స్టారర్ అని ప్రకటించిన వెంటనే అనేక వార్తలు వచ్చాయి. సినిమా ఎప్పుడు స్టార్ట్ అవ్వుతుంది అని, అసలు కథ ఏంటి అని, హీరోయిన్స్ ఎవరు అని ఇలా రోజుకో న్యూస్ తో ఆర్ ఆర్ ఆర్ చిత్రం ఫుల్ ఆక్టివ్ గా సోషల్ మీడియా లో ఉంటుంది.ఇప్పుడు ఈ చిత్రంలో రమ్యకృష్ణ నటిస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. బాహుబలి చిత్రంలో శివగామి పాత్రలో రమ్యకృష్ణ నటించి సినిమా స్థాయి ని పెంచారు.

Ramya-Krishna

అందుకని ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ లోకూడా రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తుంది అంటున్నారు. కానీ ఈ విషయంలో చిత్రం బృందం, రాజమౌళి నుండి ఏలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అలాగే ప్రియమణి కూడా కూడా ఈ చిత్రం లో నటిస్తుంది అని వార్తలు వస్తునాయి. అధికారిక ప్రకటన రావలిసి ఉన్నది. రాజమౌళి హీరోయిన్స్ విషయంలో కూడా ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం షూటింగ్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లపైన భారీ ఫైట్ ను తీస్తున్నాడు. ప్రస్తుతం చేస్తున్న షెడ్యూల్ ముగింపు దశకు చేరుకుంది. ఆ తరువాత హీరోయిన్స్ తో షూటింగ్ షెడ్యూల్ ఉంటుందని తెలుస్తోంది.