సినిమాకు ఆ రెండే అవసరం అంటున్న రకుల్‌…!

Rakul Rreet Singh Item Song In Ram Charan Boyapati Movie

స్టార్‌ హీరోల సరసన నటించి అనతికాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయిన రకుల్‌కు ప్రస్తుతం తెలుగులో పెద్దగా ఆఫర్లేమి లేవు. తెలుగులో లేకున్నా తమిళంలో మాత్రం ఈ అమ్మడికి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల చరణ్‌తో ప్రత్యేక పాట ఆఫర్‌ వస్తే రకుల్‌ నో చెప్పింది. ఈ ప్రత్యేక పాటలో నర్తించి ఉంటే ఆ వెంటనే వేరే ఆఫర్లు కూడా వచ్చేవి కానీ ఈ అమ్మడు ఐటెం సాంగ్‌ చేయడానికి తిరస్కరించింది. సినిమాలను ఎంపిక చేసుకోవడంలో తన పాత్ర పరిధిని చాలా కీలకంగా తీసుకునే రకుల్‌ సినిమా హిట్‌, ఫట్‌లకు కారణం వివరించింది.

rakul-preet-singh

ఒక సినిమా హిట్‌ కావాలంటే అందుకు హీరో, హీరోయిన్లు ముఖ్యం కాదు, మంచి కథ ఉండాలి, ఆ కథను మలచడానికి ప్రతిభావంతుడైన దర్శకుడు ఉండాలి కానీ హాట్‌ హీరోయిన్లు, స్టార్‌ హీరోయిన్లు, స్టార్‌ హీరోలు ఉంటే హిట్‌ అవదు. దర్శకుడు, కథ స్ట్రాంగ్‌గా ఉంటే ఆ చిత్రంలో నటించింది ఎవరైనా సరే మంచి సక్సెస్‌ అవుతుంది అని నేను నమ్ముతాను అంటూ రకుల్‌ చెప్పుకొచ్చింది. సినిమా విజయానికి కథ, దర్శకుడు మాత్రమే బాద్యత వహించగలరు, ఈ రెండు కరెక్ట్‌గా ఉంటే సక్సెస్‌ సొంతం అవుతుందని రకుల్‌ అంటోంది.

rakul-preet-singh