ర‌కుల్ సోద‌రుడి మూవీ లోగో పోస్ట‌ర్ లాంచ్ చేసిన నాగ్

nagarjuna launched logo of ninne pelladatha

ఉత్తరాది భామ రకుల్ ప్రీత్ సింగ్ సౌత్ లో తన హవా చూపిస్తుంది. బ‌డా హీరోల సరసన వరుస ఆఫర్లు అందుకుంటూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లింది. ర‌కుల్ న‌టించిన తాజా చిత్రం మ‌న్మ‌థుడు 2. ఈ చిత్రం ఆగ‌స్ట్ 9న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే ఈ అమ్మడు ఒక‌వైపు సినిమాల‌లో న‌టిస్తూనే మ‌రోవైపు హైదరాబాద్ లో , వైజాగ్ లో తన బిజినెస్ ని చక్కదిద్దుకుంటుంది. హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కొని ఇక్కడే మకాం వేసింది. ఇప్పుడు తన తమ్ముడిని తెలుగు ఇండస్ట్రీకి ప‌రిచ‌యం చేస్తుంది .

ర‌కుల్ సోద‌రుడు అమ‌న్ వెండితెర‌ ఆరంగేట్రం ‘సెడిషన్‌’ అనే హాలీవుడ్ చిత్రంతో జ‌రిగింది. ఇందులో సీఐఏ ఏజెంట్‌ పాత్రలో అమ‌న్ క‌నిపించాడు . ఈ మూవీ ఇంగ్లీష్‌తో పాటు హిందీలోనూ విడుదల అయింది. సమ్మర్‌ బోధి నిక్స్‌,, జోయెల్‌ మరాక్కోలు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆస్ట్రేలియా, అమెరికా, ఇండియాలో ఈ సినిమా విడుదల అయింది. అయితే తెలుగులోను ర‌కుల్ సోద‌రుడు డెబ్యూ ఇస్తున్నాడు. ర‌జిని ఫిల్మ్ కార్పొనేష‌న్‌పై దాస‌రి లారెన్స్ ద‌ర్శ‌క‌త్వంలో నిన్నే పెళ్ళాడ‌తా చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్ర పోస్ట‌ర్‌ని తాజాగా నాగార్జున చేతుల మీదుగా విడుద‌ల చేయించారు మేక‌ర్స్. 1996 లో కృష్ణవంశీ దర్శకత్వంలో నిన్నే పెళ్ళాడ‌తా అనే చిత్రం తెర‌కెక్కిన విష‌యం తెలిసిందే . ఇందులో అక్కినేని నాగార్జున, టబు ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పుడు మ‌ళ్ళీ అదే టైటిల్‌తో చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, ఆ చిత్ర పోస్ట‌ర్‌ని నాగ్ రివీల్ చేయ‌డం విశేషం. అమ‌న్ ఆ మ‌ధ్య చందు హుగ్గిహెళ్ళ దర్శకత్వంలో రూపొందిన రాక్ ఎన్ రోల్ అనే షార్ట్ ఫిలింలో ప్రధాన పాత్ర పోషించారు. ఇందులో అమ‌న్ ప‌ర్‌ఫార్మెన్స్‌కి మంచి పేరు వ‌చ్చింది.