నేటి నుండి సెట్స్ పైకి వెళ్ళ‌నున్న మ‌ణిర‌త్నం చిత్రం

manirathnam new movie started

ఆణిముత్యాల్లాంటి సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించే ద‌ర్శ‌క నిర్మాత మ‌ణిర‌త్నం. కొద్ది రోజులుగా ఆయ‌న క‌ల‌ల ప్రాజెక్ట్ ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ పుస్తకం ఆధారంగా తెరకెక్క‌నున్న చిత్రం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌తో బిజీగా ఉన్నాడు మ‌ణి. మ‌రోవైపు త‌న సొంత ప్రొడ‌క్ష‌న్ సంస్థ మ‌ద్రాస్ టాకీస్ బేన‌ర్‌పై ప‌లు సినిమాలు నిర్మిస్తున్నాడు. ఈ క్ర‌మంలో తాజాగా వాన‌మ్ కొట్టాటుమ్ అనే ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నాడు. తాజాగా ప్రాజెక్ట్‌కి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు. నేటి చిత్ర షూటింగ్ మొద‌లు కానుంద‌ని తెలియ‌జేశారు. విక్ర‌మ్ ప్ర‌భు, ఐశ్వ‌ర్య రాజేష్‌, మ‌డోన్నా సెబాస్టియ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మ‌ణిర‌త్నం నిర్మించ‌డ‌మే కాకుండా కో రైట‌ర్‌గా కూడా ప‌ని చేస్తున్నాడు. ధ‌న‌శేఖ‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డం ఖాయ‌మని మేక‌ర్స్ అంటున్నారు. ఇక ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ పుస్తకం ఆధారంగా తెర‌కెక్క‌నున్న చిత్రాన్నికూడా త్వ‌ర‌లోనే సెట్స్ పైకి తీసుకెళ్ళాల‌ని మ‌ణిర‌త్నం భావిస్తున్నాడు. ఈ చారిత్రాత్మ‌క చిత్రంలో జయం రవి, విక్రమ్, అనుష్క, కీర్తి సురేష్, విజయ్ సేతుపతి, మోహ‌న్ బాబు లు కూడా నటించనున్నారు.