దేవ్’ ట్రైలర్…కాస్త ఇంటరెస్టింగ్ గా, ఇంకాస్త కొత్తగా…!

 

Dev Movie Theatrical Trailer

కార్తీ .. రకుల్ జంటగా రజత్ రవిశంకర్ దర్శకత్వంలో ‘దేవ్’ సినిమా నిర్మితమైంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన దేవ్ టీజర్‌ ని హీరో సూర్య నిన్న విడుదల చేశారు. లవ్, రొమాన్స్, యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్స్ మేళవింపుతో ‘దేవ్’ టీజర్‌కి మంచి మార్కులే పడుతున్నాయి. ప్రకాష్ రాజ్, రమ్యక్రిష్ణ కీలకపాత్రల్లో కనిపిస్తున్నారు. హరీష్ జైరాజ్ మ్యూజిక్, ఆర్ వేల్‌రాజ్ సినిమాటోగ్రఫీ చిత్రానికి హైలైట్‌గా నిలువనున్నాయి. ప్రేమికులు రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది దేవ్.

యాక్షన్ .. ఎమోషన్ .. రొమాన్స్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా వుంది. ప్రధాన పాత్రధారులందరినీ కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేలా వుంది. ‘ఏ పని చేసేటప్పుడు మనసు ప్రశాంతంగా .. సంతోషంగా ఉంటుందో అదేరా నువ్వు చేయాల్సిన పని’ .. ‘శరీరాన్ని దృఢ పరచుకోవాలంటే ఎన్నో దారులున్నాయి .. మనసును దృఢ పరచుకోవాలంటే ఒంటరితనం వల్లనే అవుతుంది’ అంటూ కార్తీ చెప్పిన డైలాగ్స్ బాగున్నాయి. టీజర్‌పై మీరూ ఓ లుక్కేయండి.