పేదల ఆకలి తీరుస్తున్న రకుల్ ప్రీత్ సింగ్

పేదల ఆకలి తీరుస్తున్న రకుల్ ప్రీత్ సింగ్

దేశంలో రోజురోజుకు పెరుగుతున్న మహమ్మారి కరోనా వైరస్ ని నివారించడానికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. కానీ ఈ లాక్ డౌన్ నేపథ్యంలో దాదాపుగా చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అంతేకాకుండా రోజు వారి కూలీ చేసుకుని బ్రతికేవారి పరిస్థితి మరీ దారుణంగా తయారయింది. అందుకనే అలాంటి వారిని ఆదుకొని, వారికి అండగా నిలవడానికి ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ ముందుకొచ్చి, తన మానవత్వాన్ని చాటుకుంది. అయితే ఈ విషయాన్నీ అంతటిని కూడా సామాజిక మాంద్యమాల ద్వారా వెల్లడించింది. కాగా గుర్గావ్ లోని మురికివాడ ప్రాంతంలో నివసిస్తున్న 250 కుటుంబాలను దత్తత తీసుకున్నామని చెప్పింది.

అంతేకాకుండా రకుల్ ప్రీత్ సింగ్ వాళ్ళ తండ్రి సమక్షంలోనే దత్తత తీసుకున్న 250 కుటుంబాలకు ప్రతీరోజు రెండు పూటలు వారికి సరిపడా ఆహారాన్ని, పండ్లు, ఫలాలను అందిస్తున్నామని, రకుల్ ప్రీత్ సింగ్ వెల్లడించింది. అంతేకాకుండా భయంకరమైన మహమ్మారి కరోనా వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు పాటిస్తూ, ఆకలితో అలమటిస్తున్న పేదలకు సరిపడా ఆహారం అందిస్తున్నామని, వివరించింది. అంతేకాకుండా ఈ మహమ్మారిని నివారించడానికి ప్రజలందరూ కూడా సామాజిక దూరాన్ని పాటించాలని, ప్రభుత్వానికి సహకరించాలని వెల్లడించింది.