‘వెంకీమామ’ ఇక లేనట్టే…?

Producer-Suresh-Babu-Hold-O

విక్టరీ వెంకటేష్‌ తన మేనల్లుడు, అక్కినేని యంగ్‌హీరో అక్కినేని నాగచైతన్యతో కలిసి ఓ మల్టీస్టారర్‌లో నటించనున్నాడనే విషయం తెల్సిందే. వెంకీ, చైతూల కాంబోలో ‘వెంకీమామ’ రాబోతుందనగానే అక్కినేని అభిమానులు, దగ్గుబాటి అభిమానులు ఫుల్‌ ఖుషీ అయ్యారు. ఈ చిత్రాన్ని తెరకెక్కించనుండగా కోన వెంకట్‌, సురేష్‌ బాబులు కలిసి నిర్మించనున్నారు. త్వరలో ఈ చిత్రం సెట్స్‌ మీదకు వెళ్లనుందనే వార్తలు తాజాగా వచ్చిన విషయం తెల్సిందే. దర్శకుడు బాబీ తాజాగా దర్శకుడు బాబీ, కోన వెంకట్‌లు కథను ఫైనల్‌ చేసి సురేష్‌ బాబును సంప్రదించారట.

Venkatesh Naga Chaitanya Film To Be Titled Venky Mama

ఫైనల్‌ వెర్షన్‌ నిర్మాత సురేష్‌ బాబుకు నచ్చలేదనే టాక్‌ వినిపిస్తోంది. కథ మాములుగా ఉండడంతో… మామూలు కథతో ప్రేక్షకుల ముందుకు వెళ్లి ఫెయిల్‌ అయ్యే దానికంటే ఇప్పుడే పక్కన పెట్టడం మంచిదని సురేష్‌ బాబు ‘వెంకీమామ’ ప్రాజెక్ట్‌ను హోల్డ్‌లో పెట్టినట్టుగా విశ్వసనీయ సమాచారం. అయితే కథలో మార్పులు ఏమన్నా చేసి మళ్లీ సురేష్‌ బాబు దగ్గరకు వెళతారా? లేక ఇక ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెడతారా అనేది క్లారిటీ లేదు. ‘వెంకీమామ’ ఇక లేనట్టే అనే వార్త అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది.

venkymava