విశాఖలో అర సెంటిమీటర్ కి హైదరాబాద్‌ లో 9 కుట్లు ..‍! మిస్టరీ ఇదేనా…!

Jagan Shock To AP Police Officials Rejects To Give Statement

విశాఖ ఎయిర్ పోర్టులో జరిగినట్లు చెబుతున్న దాడిలో జగన్ కు అయిన గాయంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. దాడి ఘటన జరిగిన వెంటనే విమానాశ్రయంలోని డ్యూటీ డాక్టర్ ఆయనకు ప్రాధమిక వైద్యం చేశారు. హాఫ్ సెంటిమీటర్ గాయం మాత్రమే కావడంతో గాయం దగ్గర శుభ్రం చేసి యాంటిబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఇచ్చి పంపేశారు. దానికి కట్టు కూడా అవసరం లేదని తేల్చారు. ఈ మేరకు నిబంధనల ప్రకారం వైద్యం చేసినట్లు.. నివేదిక.. రిపోర్టును.. ఎయిర్‌పోర్టు సిబ్బందికి ఇచ్చారు. ప్రాథమిక చికిత్స చేయించుకున్న దాదాపు గంట తర్వాత హైదరాబాద్ ఫ్లైట్ వచ్చింది.

jagan
జగన్ తన బాడీ లాంగ్వేజ్ లో ఎలాంటి మార్పులు తెచ్చుకోలేదు. ఎప్పటి లాగే అందరికీ నమస్కరిస్తూ వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై.. ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో ప్రయాణానికి అనుమతి ఇచ్చారు. అయితే.. అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి… హైదరాబాద్ కు వచ్చిన తర్వాత తన ఇంటి సమీపంలో ఉన్న సిటీ న్యూరో హాస్పిటల్ అనే ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ డాక్టర్లు కాస్తంత డ్రామా నడిపించారు. అనస్థిషీయా మత్తులో జగన్ ఉన్నట్లు కొన్ని ఫోటోలు చేశారు. తొమ్మిది కుట్లేసినట్లు చెప్పుకొచ్చారు. ఏకంగా ఒకటిన్నర ఇంచ్ లోతులో గాయం అయినట్లు కూడా రిపోర్ట్ విడుదల చేశారు.

attacked-on-jagan
దీంతో .. జగన్ గాయంపై కొత్త అనుమానాలు ప్రారంభమయ్యాయి. అసలు విశాఖలో వైద్యులు ప్రాథమిక వైద్యం చేసి చెప్పింది కరెక్టా..? లేక హైదరాబాద్ జగన్ వైద్యం చేయించుకున్న ఆస్పత్రి కరెక్టా..? మరోవైపు, విమానాశ్రయంలో జగన్ కు చికిత్స చేసిన అపోలో ఆసుపత్రి డాక్టర్ లలిత స్వాతి ఓ వ్యక్తితో ఫోన్ లో మాట్లాడుతూ… భుజానికి అర సెంటీమీటరు లోతున గాయమైందని తెలిపారు. సాధారణంగా కట్ అయినట్టే అయిందని, దీని వల్ల కొంచెం బ్లీడింగ్ అయిందని చెప్పారు. కానీ అది విషం పూసినది అయిఉండవచ్చు అనే కారణం వలన గాయాన్ని పెద్దడి చేసి చేస్క చేసి ఉండవచ్చని చెప్పుకొచ్చారు. దీంతో, గాయం లోతుపై చర్చ మొదలైంది. ఆ ఆడియో వింటే మీకు కూడా విషయం మీద కాస్త అవగాహన రావచ్చు.