జీవిత రాజశేఖర్‌ల మద్య విభేదాలు?

Actor Rajsekhar's Daughter Shivani Movie Arguments in Our House

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Actor Rajsekhar’s Daughter Shivani  Movie Arguments in Our House

టాలీవుడ్‌లో జీవిత రాజశేఖర్‌లకు ప్రత్యేకమైన స్థానం ఉంది. వీరిద్దరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరు పెళ్లి తర్వాత కూడా ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తున్నారు. ఏ సినిమా వేడుకకు వెళ్లినా ఏ ఇతర కార్యక్రమంకు వెళ్లినా కూడా ఇద్దరు జతగా వెళ్లడం జరుగుతుంది. దాంతో వీరిద్దరిని టాలీవుడ్‌ అన్యోన్య దంపతులుగా అంటూ ఉంటారు. అలాంటి అన్యోన్న దంపతుల మద్య బేదాభిప్రాయాలు వస్తున్నట్లుగా తెలుస్తోంది. అది కూడా తమ కన్న కూతురు వల్ల కావడం విశేషం.

రాజశేఖర్‌, జీవితల పెద్ద కూతురు శివాని. ఈమె గత రెండు మూడు సంవత్సరాలుగా హీరోయిన్‌గా పరిచయం కాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ మద్య డాక్టర్‌ చదువుతుందని, ఇప్పట్లో సినిమాలు చేసే ఉద్దేశ్యం తన కూతురుకు లేదు అంటూ జీవిత చెప్పుకొచ్చింది. తాజాగా శివాని ఎంబీబీఎస్‌ పూర్తి చేసింది. దాంతో సినిమాలపై దృష్టి పెట్టింది. ఒక తమిళ సినిమాలో శివాని హీరోయిన్‌గా పరిచయం కాబోతుంది.

జీవిత మాత్రం శివానిని ఒక స్టార్‌ హీరోకు జోడీగా గ్లామర్‌ హీరోయిన్‌గా పరిచయం చేయాలని భావిస్తుంది, కాని రాజశేఖర్‌ మాత్రం తన కూతురును పద్దతిగా కొత్త హీరోకు జోడీగా పరిచయం చేయాలని భావిస్తున్నాడు. ఇప్పుడు ఈ విషయమై వీరిద్దరి మద్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. చివరకు నిర్ణయాన్ని శివానికే వదిలేసినట్లుగా తెలుస్తోంది. శివాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి.

మరిన్ని వార్తలు:

ఎన్టీఆర్ కి శంకరాభరణం వచ్చింది.

పిల్లల కోసం అవార్డులన్న సమంత