వేమూరి ఎక్కడివాడు?

vemuri anand surya as new brahmana corporation chairman

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ లో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన మేలెంతో కానీ ఐవైఆర్ ఎపిసోడ్ తో చంద్రబాబు సర్కార్ ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. ఐవైఆర్ కృష్ణారావుని ఇంటికి సాగనంపుతూ తీసుకున్న నిర్ణయం టీడీపీ శ్రేణులకు కాస్త ఊరట ఇచ్చింది. అయితే ఆ వెంటనే అదే పదవిలో బాబు కూర్చోబెట్టిన వేమూరి ఆనంద్ సూర్య ఎక్కడివాడు అన్న దానిపై వివాదం రేగింది. ఒకప్పుడు హైదరాబాద్ గోడల మీద ఎక్కడ చూసినా ఈ వేమూరి ఆనంద్ సూర్య పేరు కనపడుతుండేది. పార్టీ లో నాయకుడుగా ఎదిగేందుకు ఆయన ఎంచుకున్న చౌకైన పద్ధతి అది. టీడీపీ విధానాలు, లేదా చంద్రబాబు ఆశయాలు పేరిట గోడల మీద తన పేరుతో తెగ రాయించే సూర్య హైదరాబాదీ అని అంతా అనుకున్నారు. అప్పట్లో ముషీరాబాద్ అసెంబ్లీ టికెట్ కోసం కోసం సూర్య గట్టిగానే ట్రై చేసి ఫెయిల్ అయ్యాడు. అయితే ఐవైఆర్ వ్యవహారం చూసాక మేధావుల కన్నా పార్టీ కి విధేయంగా వున్నవారికి పెద్ద పీట వేయాలని బాబు నిర్ణయించుకోవడంతో సూర్య కి ఛాన్స్ దొరికింది.

వేమూరి ఆనంద్ సూర్య హైదరాబాద్ కి చెందినప్పటికీ ఆయన మూలాలు ఆంధ్రావే అని తెలుస్తోంది. కానీ ఆంధ్రజ్యోతి పత్రికలో అతను గుంటూరు జిల్లా రేపల్లెకి చెందినవాడని రాస్తే, సాక్షిలో మాత్రం పశ్చిమగోదావరి జిల్లా వాడు అని రాశారు. దీంతో వేమూరి ఎక్కడివాడు అన్న ప్రశ్నకి ఏది సరైన సమాధానమో అర్ధం కాకుండా అయిపోయింది. అయితే వేమూరి ఎక్కడివాడైతేనేమి టీడీపీ అభిమాని అని ఆ పార్టీ భావిస్తోంది. ఒకవేళ ఆయన హైదరాబాద్ కి తద్వారా తెలంగాణ కి చెందినవాడు అనుకున్నా ఇలాంటి నియామకం జరగడం ఇదేమీ తొలిసారి కాదు. అంతకుముందు ఖమ్మం జిల్లాకి చెందిన పార్టీ నాయకుడు, బ్రాహ్మణ వర్గానికే చెందిన రావులపాటి సీతారామారావు ని ఏపీ పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించిన సంగతి తెలిసిందే. మొత్తానికి ఐవైఆర్ తొందరపాటు, కృతఘ్నత తో వేమూరి ఆనంద్ సూర్య పంట పండింది. ఆయన ఎక్కడివాడు అన్నది కూడా పెద్దగా పట్టించుకోకుండా బాబు పదవి ఇచ్చేసారు.