పిల్లల కోసం అవార్డులన్న సమంత

Samantha Wants Film Fare Award' s To Show Her Children

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Samantha Wants Film Fare  Award’ s To Show Her Children

తాజాగా హైదరాబాద్‌లో జరిగిన 64వ జియో ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల వేడుకలో సమంత సందడి చేసింది. ‘అఆ’ చిత్రంకు గాను సమంత ఉత్తమ నటిగా ఎంపిక అయ్యింది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో నితిన్‌కు జోడీగా సమంత నటించిన విషయం తెల్సిందే. ఉత్తమ హీరోయిన్‌గా సమంత పలువురు హీరోయిన్స్‌తో పోటీ పడటం జరిగింది. ‘నాన్నకు ప్రేమతో’లో నటించిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ‘నేను శైలజ’ చిత్రంలో నటించిన కీర్తి సురేష్‌, ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రానికి గాను లావణ్య త్రిపాటి, ‘పెళ్లి చూపులు’ చిత్రంలో నటించిన రీతూ వర్మ, ‘జెంటిల్‌మన్‌’లో నటించిన నివేదా థామస్‌లతో సమంత పోటీ పడి ‘అఆ’ చిత్రంలో అద్బుత నటనకు అవార్డును దక్కించుకుంది.

అవార్డు అందుకున్న సమయంలో సమంత మాట్లాడుతూ.. ఈ అవార్డు వస్తుందా రాదా అని చాలా టెన్షన్‌ పడ్డాను. ఆ సమయంలో చైతన్య నాతో అవార్డు గెలుచుకోవడం కోసం ఇంత టెన్షన్‌ ఎందుకు అంటూ అడిగాడు. అందుకు నేను సమాధానంగా ‘రేపు మన పిల్లలు నాన్న పెద్ద స్టార్‌ మరి నువ్వు ఏంటి అమ్మ’ అంటూ అడిగితే ఈ అవార్డులు చూపిస్తాను అంటూ చెప్పుకొచ్చింది. సమంత మాటలకు ఆడిటోరియంలో ఉన్న వారు అంతా కూడా గట్టిగా చప్పట్లు కొట్టి సమంతను అభినందించారు. అక్టోబర్‌లో నాగచైతన్య, సమంతల వివాహం జరగబోతున్న విషయం తెల్సిందే.

మరిన్ని వార్తలు

మళ్లీ ఎన్టీఆర్‌ను వాడాలని బాబు ప్లాన్‌

డీజే’కు క్లీన్‌ చీట్‌