బతిమిలాడి ఒప్పించారు

Actress Nayanthara Confirmed In Sanghamitra Movie Heroine

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Actress Nayanthara Confirmed In Sanghamitra Movie Heroine

తమిళంలో భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ‘సంఘమిత్ర’ చిత్రంలో హీరోయిన్‌గా నయనతార దాదాపుగా ఖాయం అయినట్లుగా తెలుస్తోంది. మొదట ఈ సినిమాలో ముద్దుగుమ్మ శృతిహాసన్‌ను ఎంపిక చేయడం జరిగింది. ఆమె దాదాపు నెల రోజుల పాటు విదేశాల్లో ‘సంఘమిత్ర’ చిత్రం కోసం ట్రైనింగ్‌ కూడా తీసుకుంది. అయితే ఆమె కొన్ని కారణాల వల్ల తప్పుకుంది. దాంతో చిత్ర దర్శకుడు మరియు నిర్మాతలు ఎంతో మందితో సంప్రదింపులు జరిపి చివరకు నయనతార వద్దకు వచ్చి ఆగారు.

మొదట నయనతార ఈ భారీ చిత్రంలో నటించేందుకు ఒప్పుకోలేదు. తాను ఎక్కువ డేట్లను కేటాయించలేను అంటూ ముందే చెప్పేసింది. తమ ముందు ఉన్న ఆప్షన్‌ మీరు అని, పారితోషికంగా ఎంతైనా ఇచ్చేందుకు సిద్దం అని, మీకు ఇష్టం వచ్చిన సమయంలో డేట్లు ఇవ్వాల్సిందిగా నిర్మాతలు ప్రాదేయ పడటంతో తప్పని పరిస్థితుల్లో భారీ పారితోషికం ఆశతోనే సంఘమిత్రలో నటించేందుకు నయనతార ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. అతి త్వరలోనే సంఘమిత్ర షూటింగ్‌లో నయన్‌ పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాహుబలి స్థాయిలో ఈ సినిమా ఉంటుందనే నమ్మకంతో తమిళ ఆడియన్స్‌ ఉన్నారు. సినిమా ప్రారంభం కాకుండానే అనేక కష్టాలు ఎదుర్కొంటున్న ఈ చిత్రం విడుదల సమయంకు ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది అనేది చూడాలి.

మరిన్ని వార్తాలు:

అంజలికి తోడు ఉంటానన్న హీరో.

ఫిదా మూవీ లేటెస్ట్ టీజర్ అదుర్స్…