నా బరువుతో మీకు సమస్య ఏంటీ?

Nithya Menon fair on Journalist

‘అలా మొదలైంది’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయిన మలయాళి ముద్దుగుమ్మ నిత్యామీనన్‌ కొద్ది కాలంలో తెలుగులో మంచి గుర్తింపు దక్కించుకుంది. అయితే ఈమె ఎక్స్‌ పోజింగ్‌కు ఒప్పుకోక పోవడంతో పాటు, సినిమాలో తన పాత్రకు ప్రాముఖ్యత ఉంటేనే నటిస్తాను అంటూ చెబుతూ రావడంతో మెల్ల మెల్లగా ఈమెకు అవకాశాలు తగ్గాయి. సెకండ్‌ హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, గెస్ట్‌ రోల్స్‌లో నటిస్తూ వస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో కనీసం ఒక్క సినిమా కూడా చేయడం లేదు. తమిళం, మలయాళం చిత్రాల్లో అడపా దడపా చేస్తూ వస్తుంది. ఇక ఈమె ఈమద్య కాలంలో చాలా బరువు పెరిగి చాలా బొద్దుగా అనిపిస్తుంది. ఈ విషయమై ఒక మీడియా పర్సన్‌ ప్రశ్నించగా చడామడా తిట్టేసింది.

nithya menon

ఒక ఇంటర్వ్యూలో నిత్యామీనన్‌ను మీరు మరీ లావు ఎక్కువ అయ్యారు కదా అంటూ ప్రశ్నించగా నిత్యామీనన్‌కు కాస్త కోపం వచ్చింది. లావు ఎక్కువ ఉన్నంత మాత్రాన అనారోగ్య సమస్యలు ఉన్నట్లు కాదు, బక్కగా ఉన్నంత మాత్రాన ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు. ఎంత లావు ఉన్నా కూడా నేను చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటాను. ఆ ఆత్మవిశ్వాసం నన్ను ముందుకు నడుపుతుంది. నా బరువు గురించిన సమస్య నాది, మీకు నా బరువు గురించిన ఆలోచన అనవసరం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. నా శరీరం గురించి మాట్లాడే హక్కు ఎవరికి లేదు అంటూ ఆమె పేర్కొంది. హీరోయిన్‌ అన్నప్పుడు నాజూకుగా, అందంగా ఉండాలి. కాని నిత్యా మాత్రం బరువు ఎక్కువ అవుతుందని ఆమె అభిమానులు కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాన్నే ఆమెకు తెలియజేసేందుకు మీడియా ప్రయత్నిస్తే ఇలా రెచ్చి పోయి మరీ తిడుతుంది. నిత్యాకు ఈగో చాలా ఉంటుందని ఇండస్ట్రీలో టాక్‌ ఉంది. అది మరోసారి నిరూపితం అయ్యింది.