నిత్యామీనన్‌ కి పెళ్లి గిళ్లీ వద్దంట ఇలాగే ఉంటుందంటా’..

ఇప్పటికే బ్రీత్‌, మోడ్రన్‌ లవ్‌ హైదరాబాద్‌ వంటి వెబ్‌ సిరీస్‌ల్లోనూ నటించి అందరిని మెప్పించింది. తన పాత్రకు స్కోప్‌ ఉన్న పాత్రల్లోనే నటిస్తూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ని సంపాదించుకున్న నిత్యా మీనన్‌.. తాజాగా మరో ఓటీటీ ప్రాజెక్ట్‌లో కూడా నటిస్తోంది. అమెజాన్‌ ప్రైమ్‌ నిర్మిస్తున్న ‘కుమారి శ్రీమతి’ వెబ్‌ సిరీస్‌లో నిత్యామీనన్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. 

Untitled design 2023 09 16T175741.680

నిత్యమీనన్‌.. ఈ పేరును తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . అలా మొదలైందిన చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పలకరించిన ఈ చిన్నది తొలి మూవీ తోనే తనదైన ముద్ర వేసింది. ఇష్క్‌, గుండెజారి గల్లంతయ్యిందే, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, జనతా గ్యారేజ్‌ ఇలా ప్రతీ మూవీ లో తన నటనతో మెస్మరైజ్‌ చేసింది. గ్లామర్‌ పాత్రలకు వీలైనంత వరకు దూరంగా ఉంటూనే కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తూ మెప్పిస్తుంది నిత్యామీనన్‌ .

ఇక ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఓటీటీల్లోనూ తళుక్కుమంటోంది. శనివారం ఈ వెబ్‌ సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ మోషన్‌ వీడయోను కూడా విడుదల చేసింది. ఇందులో నిత్యా పాత్రపై మేకర్స్‌ ఒక క్లారిటీ ఇచ్చారు.