రామ్ చరణ్ “గేమ్ చేంజర్” సాంగ్ లీక్ పై పోలీస్ కేసు !

రామ్ చరణ్ “గేమ్ చేంజర్” సాంగ్ లీక్ పై పోలీస్ కేసు !
Latest News

ప్రముఖ దర్శకుడు శంకర్ , రామ్ చరణ్ మరియు కియారా అద్వానీల కాంబినేషన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న “గేమ్ చేంజర్” షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తుంది . కాగా ఈ మూవీ నిర్మాత దిల్ రాజు పోలీస్ స్టేషన్ కు వెళ్లినట్లు తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే… భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్క సమాచారాన్ని ఎంతో సీక్రెట్ గా మైంటైన్ చేస్తున్నా ఈ మధ్యన ఒక సాంగ్ లీక్ అయిన విషయం చిత్ర బృందం మొత్తాన్ని టెన్షన్ లో పడేసింది. అయితే ఈ విషయాన్ని ఈజీగా వదిలేయకుండా దిల్ రాజు పోలీస్ కేసు పెట్టడం కూడా జరిగింది. ఈ సాంగ్ ను ఎవరైతే లీక్ చేశారో వారిపై కఠిన చర్యలు తీసుకునే వరకు మేము వదిలిపెట్టం అని దిల్ రాజ్ స్వయంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు నమోదు చేపించారు . కోట్లు ఖర్చు పెట్టి మూవీ లు తీస్తుంటే ఈ విధంగా దొంగ మార్గాలలో లీక్ లు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అంటూ సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ ఆందోళన చేస్తున్నారు.

రామ్ చరణ్ “గేమ్ చేంజర్” సాంగ్ లీక్ పై పోలీస్ కేసు !
Ram Charan” Game Changer”

కాగా ఈ సినిమా ఒక అవినీతికి సంబంధించిన కాన్సెప్ట్ ను తీసుకుని చేస్తున్నట్లు ఇప్పటికే హింట్ ఇచ్చారు.