ఎన్టీఆర్‌ ఇంకా ఫిక్స్‌ కాలేదట…!

NTR And Trivikram Movie Release Get Soon

ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘అరవింద సమేత’ చిత్రం టాకీ పార్ట్‌ పూర్తి అయిన విషయం తెల్సిందే. త్వరలో మిగిలి ఉన్న పాటల చిత్రీకరణ పూర్తి చేయబోతున్నారు. ఇక ఈ సమయంలోనే సినిమా ఆడియో విడుదల గురించి చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఈ చిత్రం ఆడియోను ఈనెల 20న నిర్వహించాలని నిర్మాత నిర్ణయించుకున్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రారంభించినట్లుగా ప్రచారం జరుగుతుంది. కాని విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు సినిమా ఆడియో విడుదలకు సంబంధించిన చర్చలు జరుగలేదని, షూటింగ్‌తో అంతా బిజీగా ఉండటం వల్ల ఆ టైం రాలేదు అంటూ సమాచారం అందుతుంది.

ntr-movies

తాజాగా టాకీ పార్ట్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆడియో విడుదల గురించి నేడు లేదా రేపు ఎన్టీఆర్‌తో పాటు నిర్మాత మరియు దర్శకుడు చర్చించబోతున్నారు. ఎన్టీఆర్‌ తండ్రి మరణంతో దుఖంలో ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఆడియో విడుదల కార్యక్రమంను ఆయన ఇష్టంకు వదిలేయాలని దర్శకుడు మరియు నిర్మాత నిర్ణయించుకున్నారు. ఆయన ఇష్ట ప్రకారం ముందుకు వెళ్లాలని వారు భావిస్తున్నారు. ఎన్టీఆర్‌ త్వరలోనే తన నిర్ణయాన్ని చెబితే దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు జరిగే అవకాశం ఉంది. మరో వైపు సోషల్‌ మీడియాలో అరవింద సమేత ఆడియోకు బాబాయి బాలయ్య రాబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. ఎన్టీఆర్‌ ఆ విషయమై కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. రెండు రోజుల్లో పూర్తి వివరాలు తెలుస్తాయని చిత్ర యూనిట్‌ సభ్యులు ఆఫ్‌ ది రికార్డు చెబుతున్నారు.

ntr-thivikram